గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » పాత, కొత్త చిత్రాల అనుకరణగా ఆదివిష్ణు!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
కానీ ఫలితం ఉండకపోవడంతో.. వీరిని అనుమానిస్తాడు. మరోవైపు ఢిల్లీనుంచి ఎస్.బి.ఐ అధికారిణి ప్రేమ హైదరాబాద్ వచ్చి సమస్యకు పరిష్కారం ఎలా కనుగొంటుంది? అది ఏమిటి? మరి ఆదివిష్ణు ఏమయ్యాడు? అసలు టెర్రరిస్టు ఎవరు? మంత్రి సుమన్ పాత్ర ఏ మేరకుంది? అనేదే మిగిలిన సినిమా.

చిత్రంగా చూస్తే.. గతంలో వచ్చిన పలు చిత్రాలు స్ఫురిస్తాయి. హీరో... గ్రామం నుంచి నగరానికి రావడం, రాగానే ఏదో ఓ గొడవలో చిక్కుకోవడం, అరెస్టు కావడం, ఆ తర్వాత తన స్థితికి కారణమైన వారిపై పగతీర్చుకోవడం... అనేవి రొటీన్ కథే అయినా కొత్తదనంగా ఉంటే ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం నిరాశనే మిగిల్చుతుంది.

ఇంకా చెప్పాలంటే అనుకోని ట్విస్ట్‌లు చాలా ఉన్నాయి. స్నేహను ఒక్కసారిగా లాయర్‌గా చూపిస్తారు. ఎక్కడో చెన్నైలో పాస్‌పోర్ట్ కోసం వెళ్ళిన ఆదివిష్ణు, తన స్నేహితుడ్ని విలన్‌లు కిడ్నాప్‌చేస్తే వెంటనే హైదరాబాద్‌కు వచ్చి అందరి భరతం పడతాడు. స్నేహను దుండగుడు వ్యాన్‌లో తీసుకెళ్ళి ఊరికి దూరంగా చంపబోతుంటే... అప్పటికే మిగతా గుంపులతో దెబ్బలు తింటున్న ఆదివిష్ణు హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై ఆమెను చివరి నిమిషంలో రక్షిస్తాడు.

అమెరికా వెళ్ళిన ప్రదీప్ రావత్ కొడుకును లైట్‌డైరక్టర్‌కు రేపే తీసుకురావల్సిందిగా ఎ.సి.సి చెప్పడం విడ్డూరం. ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఈ చిత్రంలో కన్పిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా దాసరి అరుణ్ కుమార్ అమరినా, హావభావాలు చాలా మెరుగు పరుచుకోవాలి. మాస్ హీరోగా ఎదిగే ఫిజిక్ ఆయనకుంది.

స్నేహ పాత్ర ఫర్వాలేదు. హాస్యపరంగా అలీ పాత్ర అచ్చు "సూపర్"కు డిటో. వేణుమాధవ్, సునీల్, ధర్మవరపు హాస్యం కాస్త పర్వాలేదు. శ్రీలేఖ బాణీలు బాగున్నా... స్క్రీన్‌ప్లే లోపంతో సీరియస్ సన్నివేశం వెంటనే పాట రావడం స్పీడ్ బ్రేకర్‌లా ఉన్నాయి.

మొత్తానికి తను నిర్దోషినని తేలిన తర్వాత అసలు టెర్రరిస్టుకు పనిష్‌మెంట్‌తో కథ ముగుస్తుంది. కానీ దాన్ని ఇంకా పొడిగిస్తూ... మంత్రికి, మంత్రి అనుచరుడికి మధ్య జరిగే వార్‌తో కథను ఇంకాస్త పెంచారు. ఎ.సి.పి చేసిన ద్రోహం వల్ల తన భవిష్యత్తు నాశమైందని, మరి దీనికి ఏం సమాధానం చెబుతారంటూ... కోర్టులో హీరో అడిగే ప్రశ్నలు ఆకట్టుకుంటాయి. మరి కలగూరగంప కథతో ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.