గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » టెర్రరిస్టు కథానేపథ్యంలో సాగే "బ్లాక్ అండ్ వైట్"
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
చిత్రం... బ్లాక్ అండ్ వైట్
తారాగణం... రాజీవ్ కనకాల, సింధూ తులానీ, జాకీష్రాఫ్ మేల్కొటి, పి.వి.ఎల్. జాకీ, సందేశ్ తదితరులు.
నిర్మాత... పి. ఉదయ్‌కిరణ్,
దర్శకత్వం... శ్రీకాంత్ వేములపల్లి.

విషయం... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన భరత్ ప్రేమించి పెండ్లి చేసుకున్నా... అతని జీవితాన్ని ఓ సంఘటన కుదిపేస్తుంది. అదేమిటనేదే సినిమా.

అనాథ అయిన భరత్ (రాజీవ్ కనకాల) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎదుగుతాడు. ఇతనికి పిల్లలంటే ప్రేమ. తన చుట్టూ ఉన్న పిల్లల్ని ప్రేమగా చూస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ సమీరా (సింధూతులానీ)తో ఏర్పడిన పరిచయం పెళ్ళికి దారితీస్తుంది. ఈలోగా సిటీలో కొన్ని టెర్రరిస్టులు దాడులు జరుగుతుంటే ఓ సందర్భంలో భరత్ పోలీసుల ప్రాణాలు కాపాడుతాడు.

ఆయన సాహసానికి గుర్తింపుగా రాష్ట్రపతి అవార్డును ప్రకటిస్తారు. అవార్డుకోసం ఢిల్లీ వెళ్ళాలని ఉవ్విళూరుతుండగా, అనుకోకుండా భరత్ ఆసుపత్రి పాలవుతాడు. అవార్డుకోసం సమీరా వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఓ నిజం భరత్‌కు తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? అప్పుడు భరత్ ఏం చేశాడు? అన్నదే మిగిలిన సినిమా.

మొదటిభాగం కేవలం భరత్, పిల్లలు, సమీరా పాత్రల చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. చాలా నింపాదిగా కథగా నడుస్తుంది. సెకండాఫ్‌లోనే కథంతా... ఇందులో అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. భరత్ పోలీసులను బాంబ్ బ్లాస్‌నుంచి ఎలా కాపాడాడు? అన్నది అర్థం కాదు.

ఎంతో సెక్యూరిటీ ఉన్న రాష్ట్రపతి దగ్గరే సెక్యూరిటీ గార్డ్ టైమ్‌బాంబ్‌ను సమీరాకు ఎలా ఇవ్వగలిగాడు? సి.బి.ఐ ఆఫీసర్ జాకీష్రాఫ్ చెప్పిన నిజాన్ని అక్కడి సెక్యూరిటీ పట్టించుకోకపోవడం మరో విచిత్రం. వీటన్నింటికీ సమాధానాలు దొరకవు. కాకపోతే సమీరానే విలన్ అనే సస్పెన్స్‌ను దర్శకుడు చక్కగా మేనేజ్ చేశాడు.

సరైన స్క్రీన్‌ప్లేతో పాటు కథలో కొంత నవ్యత లోపించడం సినిమాకు మైనస్‌లు. కొన్ని సందర్భాల్లో తర్వాతి సీన్‌ ఏమిటో తెలిసిపోతుంది. మరి ఎన్నిరోజులు ఆడుతుందో వేచిచూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష బ్లాక్ అండ్ వైట్ రాజీవ్ కనకాల సింధూ తులానీ జాకీష్రాఫ్ మేల్కొటి పి.వి.ఎల్. జాకీ సందేశ్ తదితరులు