పాయింట్.. చెడు ఫలితాలు జరుగుతున్నప్పుడు వాటికి దూరంగా ఉండటానికి హోమం చేస్తుంటాం. ఈ చిత్ర కథలోనూ తమకు చెడు జరక్కుండా పోలీసు వ్యవస్థలో ఓ గూఢచారిని పెట్టి కథను నడిపించే గ్యాంగ్ లీడర్ కథే ఇది.
ఇక కథలోకి వెళితే... పోలీసు అవ్వాలనుకునే వ్యక్తి జగపతిబాబు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈయన ప్రయత్నాలు చూసి విశ్వనాథం (ప్రదీప్ రావత్) అనే పోలీసు అధికారి మాఫియా ముఠాలోని రహస్యాలు జారవేయమని నియమిస్తాడు.
మరోవైపు హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్‌కు నాయకుడు డాడీ (మహేష్ మంజ్రేకర్). ఎన్నో అరాచకాలు చేసినా వాడిపై సరైన ఆధారాలు లేకపోవడంతో అతన్ని అరెస్ట్ చేయలేకపోతాడు విశ్వనాథ్. దీంతో తన చీకటి వ్యాపారానికి అడ్డులేకుండా చూసుకోవడానికి డాడీ ఓ వ్యక్తిని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో నియమిస్తాడు.
ఆయనే చందు (జె.డి. చక్రవర్తి). ఇతనూ పోలీసు అధికారే. డాడీ, విశ్వనాథ్‌లు ఒకరికి తెలియకుండా ఒకరు గూఢచారులను పెట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. మరి వారి ప్రయత్నాల్లో ఎవరిది పైచేయిగా ఉంది? ఒకరినొకరు పట్టుకోగలిగారా? అరాచకాలు తగ్గాయా? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ : నటనాపరంగా చూసుకుంటే రహస్య పోలీసులుగా జగపతిబాబు, జెడీల నటన మోస్తరుగా ఉంది. అయితే క్లైమాక్స్‌లో రక్తికట్టిస్తుంది. హీరోయిన్లుగా మమతా మోహన్ దాస్, మధురిమలు పాత్రల్లో ప్రాధాన్యతల్లేవు. కాలక్షేపానికి హీరోల పక్కన పెట్టారనిపిస్తుంది. విలన్‌గా మహేష్ చక్కని నటనను ప్రదర్శించారు.
WD
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా ప్రదీప్ రావత్‌కు విభిన్న పాత్రలో చక్కగా అమరారు. హిందీలో మాట్లాడుతూ...ఎం.ఎస్ నారాయణచే హాస్యాన్ని పండించాలనుకునే ప్రయత్నం కొత్తదైనా పెద్దగా ఆకట్టుకోలేదు. జగపతిబాబు అసిస్టెంట్ ప్రభాకర్ బాగానే చేశారు.
ఈ సినిమా చూస్తున్నంత సేపూ హాలీవుడ్ చిత్రం తరహాలో అనిపిస్తుంది. చూడగా చూడగా "ది డిపార్టెడ్" అని స్ఫురిస్తుంది. ఇది ఓ కొరియన్ సినిమాకు రీమేక్. కథాంశం ఆసక్తికరమైంది. అయితే ఇతర సినిమాలచే ప్రభావితం అయినప్పుడు సహజత్వం కోసం దర్శకుడు తపిస్తూ కాస్త పట్టు కోల్పోవడం జరుగుతుంది. కథను మలిచే విధానంపై ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం వల్ల సృజనాత్మకత లోపిస్తుంది. చక్రి అండర్‌వేర్‌తో కన్పించే సందర్భాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇక టెక్నికల్ పరంగా బ్యాక్‌గ్రౌండ్ సంగీతం పర్వాలేదు. పాటలు బాగాలేవు. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. భరణి కె. ధరణ్ సినిమాటోగ్రాఫీ పర్వాలేదు. నిర్మాణ పరంగా కోనేరు కిరణ్ కుమార్ మంచి విలువలు ఆపాదించారు. ఆంగ్ల సినిమాను చూడని వారికి నచ్చుతుందేమోగానీ, సగటు ప్రేక్షకుడి తీర్పుకోసం కొద్దిరోజులు ఆగాల్సిందే...