గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » యువత ఆలోచనలకు అద్దం పట్టే "అంకిత్, పల్లవి..."
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
విశ్లేషణ:
నిఖిల్‌లో ఈజ్ ఉంది. ఎనర్జిటిక్ బాగుంది. చాలా హుషారుగా చేశాడు. సంభాషణలు చాలా కాజువల్‌గా చెప్పాడు. సిగరెట్ తాగడం, మందుకొట్టేప్పుడు మాత్రం కాస్త ఒరిజినాలిటీ దెబ్బతింది. ఆ సీన్స్‌లో పరిణితి రావాలి. మేఘాబర్మన్ కొత్తయినా ఆమె పాత్ర పరంగా ఓకే. విడిపోయాక తన తప్పును తెలుసుకున్న తర్వాత ఆమె చూపే హావభావాలు ఆకట్టుకున్నాయి. స్నేహితుల పాత్రల్లో సునీల్ పాత్రే హాస్యాన్ని పండిస్తుంది.

కథలో సాగుతూ సాగే హాస్యం మినహా ప్రత్యేకంగా ట్రాక్‌లేమీ లేకుండా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. వందరూపాయలకే మర్డర్, వంద రూపాయలకే కిస్ అనే ట్రాక్ స్నేహితుల మధ్య ఆసక్తికరమైన హాస్యాన్ని పండించింది. గిటార్‌తో తబలా ప్లే చేస్తావా? నీ సంగీతాన్ని మధ్యలో వెస్ట్రన్ మ్యూజిక్ సీడీ కలిపితే అదే గొప్ప సంగీతమంటూ వచ్చిన డైలాగ్స్ మ్యూజీషియన్‌ల తీరును తెలియజేస్తుంది.

విసుథామస్ సంగీతం బాగానే ఉంది. "దోస్త్... హే దోస్త్..." పాటలకంటే వాద్య సంగీతం హోరు ఎక్కువగా ఉంది. "నాలో ప్రాణమా... స్వరమా... స్వప్నమా... జీవన స్వప్నమా..." అనే మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది.

ఎవర్నీ ప్రేమించామన్నది కాదు. వారితో ఎంత హ్యాపీగా ఉన్నామనేది ముఖ్యం అనే సంభాణలు అతికినట్లున్నాయి. తను ప్రేమించింది.. సేల్స్ గేళ్ అయినా ఆమెతో ఉంటేనే తాను చాలా సంతోషపడతానని విప్రో మేనేజర్ సంతోష్ పవన్ అనడంతో మేఘాబర్మన్ తను చేసింది తప్పని గ్రహిస్తుంది.

ప్రేమను నిలబెట్టుకోవాలంటే లక్క్ కాదు... కమిట్ మెంట్, ఓర్పు ఉండలనేవి సందర్భానుసారంగా సాగాయి. ఫోటోగ్రఫీ పర్వాలేదు. దర్శకుడిగా హరి ఎల్లేటి తొలిప్రయత్నం బాగానే ఉంది. ఎ సెంటర్ మినహా మిగిలిన సెంటర్లలో ఈ చిత్రం ప్రశ్నార్థకమే.!
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష యువత ఆలోచనలు అద్దం అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ నిఖిల్ మేఘాబర్మన్ హరి ఎల్లేటి