గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "మల్లెపువ్వు" గుచ్చుకుంటుంది!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
విశ్లేషణ.. కోటి పాత్రలో మురళీకృష్ణ తొలి చిత్రమైనా తన పరిధిల మేరకే నటించాడు. కొత్తగా ఆయనపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో పర్వాలేదనిపించింది. కానీ సూరి పాత్రలో వి. సముద్ర నప్పలేదు. మరొకరిని పెడితే ఆ పాత్ర కనబడేది. దర్శకుడిగా సముద్ర మొదటి తప్పిదం చేశారు.

మల్లి పాత్రలో భూమిక తేలిగ్గానే చేసింది. మొదటి భాగంలో పురుషుడుగా ఉండటంతో మాటల్లేవు. సెకండాఫ్‌లో తను అనుకోని చట్రంలో ఇరుక్కున్నాన్న ఆవేదనలో బాగా నటించింది. "హైదరాబాద్ నవాబ్స్" వంటి చిత్రాల్లో ప్రధాన విలన్‌గా చేసిన ఆర్.కె. ఈ చిత్రంలో పెళ్ళామంటే భయపడే పాత్రను పోషించినా పాత్రకు తక్కువచేసినట్లే... కోవైసరళ పాత్ర రొటీన్‌గా ఉంది. మొగుడంటే లెక్కలేని పాత్రలో చీటికి మాటికి అరుపులు కేకలతో చిరాకు పెట్టిస్తుంది.

అభినయశ్రీ, గీతాసింగ్ పాత్రలు కూలీలుగానే ఉంటారు. పాట వస్తే డాన్సేస్తారు. అంతే.... ఇకపోతే మరో హీరోయిన్ ఫర్జానా పాత్ర మరీ దారుణం. వ్యభిచారగృహంలో డాన్సర్‌గా అలరిస్తుంది. నెగెటిల్ పోలీసు అధికారి సమీర్ పాత్ర పర్వాలేదు. ఈ చిత్రంలో హాయిగా నవ్వుకోవడానికంటూ ఏమీలేవు. తాను దర్శకుడవ్వాలనే కలతో వేణుమాధవ్ తన దగ్గరున్న కథలన్ని విన్పిస్తూ చేసిన ప్రయోగానికి మనమే చక్కిలిగింతలు పెట్టుకుని నవ్వుకోవాలి.

సంగీతం పరంగా ఇళాయరాజా చేశారంటేనే ఇదేదో చక్కని మల్లిపూవులాంటి వాసన గొడుతుందని అనిపిస్తుంది. సాహిత్యం బాగుంది. సంగీతం బాగుంది. "మల్లెపువ్వు"లో ఈ రెండే బాగున్నాయి. "గాజులు గాజులు నవ్వులు..." "చందమామ..." పాటలు వినసొంపుగా ఉన్నాయి.

ప్రధానంగా ఈ చిత్రానికి మైనస్ సినిమాటోగ్రఫీ. డిజిటల్ ఫార్మెట్‌లో చేసిన ఈ చిత్రంలో కలర్ ట్రేడింగ్, లైటింగ్‌లు స్పష్టంగా కన్పించే తప్పిదాలు. సన్నివేశాన్ని నీరుగార్చే విధంగా కెమెరా పనితనం ఉంది. సంభాషణల పరంగా వేమగిరి పంచ్‌లు ఏ మాత్రం పట్టు ఇవ్వలేదు. అసలు మల్లెపువ్వు అనేదానికి అర్థం రకరకాలుగా ఉంటుంది.

కథంతా పరిశీలిస్తే... బంగ్లాదేశీయుల్లోనూ మల్లెపూవు వంటి వారున్నారని, ఇండియాలోనూ అజ్ఞాత టెర్రరిస్టులున్నారని చెప్పినట్లుంది. ఢాకాలో యూనివర్శిటీ ప్రథమశ్రేణిలోఉత్తీర్ణురాలైన మల్లీశ్వరి (భూమిక) తన బామ్మ ఊరైన ఇండియా చూడాలని వస్తుంది. ఇండియాలో ఆమె తండ్రి స్నేహితుడు ఇంటిలో ఆశ్రయముంటుంది.

కానీ అతను ఓ టెర్రరిస్టు. ఆ విషయం చివరిలో తెలిసేసరికి తను అందులో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఎలా బయటపడింది అనేది రెండో భాగం. చక్కని టైటిల్‌కు టెర్రరిజంతో ఎరుపుమయం చేశాడు దర్శకుడు. ఈ చిత్రకథ పలు ఆంగ్ల చిత్రాలను పోలి ఉన్నా, ఇటీవలే విడుదలైన బ్లాక్ అండ్ వైట్, ఆదివిష్ణు షేడ్స్ కన్పిస్తాయి. "బరన్" అనే ఇరానీ సినిమా ఇన్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తీసినట్లుంది.

ఢాకాలో ఉన్న భూమిక తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడితే, ఇండియాలో ఉన్న ఆయన స్నేహితుడు హిందీలో మాట్లాడుతాడు. మల్లెపువ్వును ఒక్కమాలగా గూర్చి పొదిగే ప్రయత్నమంటూ.. చివర్లో దర్శకుడు చెప్పిన సంభాషణలు సినిమా టైటిల్ అన్వయింపుకు కుదరలేదు.

తన ఊరికి వెళుతున్న భూమికకు విమానాశ్రయంలో వీడ్కోలు చెబుతూ... గుర్తుగా హీరో పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి జేబులో ఉన్న రూపాయితో మల్లెపూవు కొని ఆమెకు ఇస్తాడు. అదే గులాబి పువ్వువుంటే.. టైటిల్... గులాబి పువ్వు అనే వారేమో... అలనాడు శోభన్‌బాబు నటించిన మల్లెపూవుకు దీనికి సంబంధం లేకపోయినా...ఆయనకు అంకితమంటూ స్లైడ్ వేశారు. అయినా ఈ సినిమాను మహిళలు ఏమేరకు ఆదరిస్తారో అనుమానమే.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష మురళీకృష్ణ భూమిక కోవైసరళ అభినయశ్రీ మల్లెపువ్వు గుబాళింపు గుచ్చుకుంటుంది ఫర్జానా