గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » వెరైటీతో ఆకట్టుకునే "చింతకాయల రవి"
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
సినిమా... చింతకాయల రవి,
నటీనటులు... వెంకటేష్, మమతా మోహన్ దాస్, అనుష్క, సునీల్, అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మి, చంద్రమోహన్, వేణు, ఎన్టీఆర్ (గెస్ట్), ఆర్తీ చాబ్రియా, సుమన్ శెట్టి, ప్రదీప్ శక్తి, రవికుమార్ తదితరులు.
నిర్మాత... నల్లమలుపు బుజ్జి,
ఎడిటర్... శ్రీకర్ ప్రసాద్,
కథ, మాటలు... కోన వెంకట్,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... యోగేష్.
విడుదల... 2-10-08.

పాయింట్... తల్లిమనస్సును బాధపెట్టకుండా చింతకాయల రవి చేసిన విన్యాసాలే ఈ సినిమా.

తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో పలు చిత్రాలు వచ్చాయి. "చింతకాయల రవి" సినిమా అదే కోవలోనిదే అయినప్పటికీ అమెరికా నేపథ్యంలో కాస్త వెరైటీగా ఉంటుంది. విక్టరీ వెంకటేష్ తన వయస్సుకు తగ్గ పాత్రను పోషించారు.

ఇక కథలోకి వెళితే... సంపాదనకోసం అమెరికా వెళ్ళిన చింతకాయల రవి (వెంకటేష్) ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. కానీ ఇండియాలోని తన గ్రామంలో ఉండే అమ్మానాన్నలైన లక్ష్మీ, చంద్రమోహన్‌ల దృష్టిలో చింతకాయల రవి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇంకేం మంచి ఉద్యోగం ఉన్న తన కుమారుడికి మంచి సంబంధం చూసి పెండ్లి చేసేద్దామని తీర్మానించుకుంటారు రవి తల్లిదండ్రులు.
అనుకున్నట్లే లక్ష్మి పెద్దింటి సంబంధం చూస్తుంది.

అమ్మాయి పేరు లావణ్య (మమతా మోహన్ దాస్). ఆమె తండ్రి షాయాజీ షిండేకు అబద్ధం చెబితే సహించని మనసత్త్వం. అలాంటిది నిశ్చితార్థం టైమ్‌లో లావణ్య స్నేహితురాలు సునీత (అనుష్క) ద్వారా రవి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదని తేలడంతో సంబంధం చెడిపోతుంది.

ఆ కోపంతో సునీతపై ప్రతీకారం తీర్చుకోవాలని వెళ్ళిన చింతకాయల రవి చివరికి ఆమె తండ్రి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తుంది. అప్పటికే రవి స్నేహితుడు హీరో వేణు ద్వారా సునీత అతని మంచితనాన్ని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి సునీత అతనికి మరింత దగ్గరవ్వాలనుకుంటుంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష చింతకాయల రవి మమతా మోహన్ దాస్ అనుష్క అలీ బ్రహ్మానందం వేణుమాధవ్ వెరైటీ