కథాబలం లేని తేజ "కేక"

చిత్రం... కేక,నటీనటులు.... రాజా (సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు), అనూప్ కుమార్, ఇషానా, ధర్మవరపు, దువ్వాసి, మోహన్ తదితరులు, సాంకేతిక సిబ్బంది... కెమెరా... పి.సి. శ్రీరామ్, సంగీతం... చక్రి,ఎడిటింగ్... శంకర్, పాటలు... సీతారామశాస్త్రి, వేటూరి, చంద్రబోస్,నిర్మాత, దర్శకత్వం... తేజ విడుదల... 23-10-08 "
చిత్రం", "జయం", "నువ్వునేను" చిత్రాల తర్వాత తేజ తీసిన సినిమాలేవీ ఆదరణ పొందలేకపోయాయి. ఆ తర్వాత ట్రెండ్‌ను మార్చి "ఫ్యామిలి సర్కస్" వంటి కుటుంబకథా చిత్రాన్ని తీసినా అదీ నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత మహేష్ బాబుతో "నిజం" చెప్పినా ప్రేక్షకులు వినలేదు. దీంతో తననెవరో తెలీకుండా పక్కదోవపట్టిస్తున్నారని, అందుకే ఆచితూచి అడుగులేస్తున్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తేజ వెల్లడించారు. అందుకే తన శైలిలో ఉండేవిధంగా కేక తీశానని ఆయన చెప్పారు. ఇకపోతే... తాజా "కేక" చిత్రంలో నటీనటుల వివరాలేవీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. ప్రతీదానికి పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం, సంగీత దర్శకుడు చక్రి పనితనం గొప్పగా చెపుతుండేవారేగానీ కథ గురించి చెప్పేవారు కాదు. "కేక" సినిమా చూశాక కథలో విషయం లేదని తేలింది. అందుకే ఆయన అలా చెప్పాడనిపించక మానదు. తేజ చేసిన పిచ్చి కేకకు థియేటర్లలో ప్రేక్షకులు గావుకేక పెడుతుండటం విశేషం.ఇక కథలోకి వెళితే...విడుదలకు ముందు తేజ చెప్పినట్లుగా అనాధ బాలల నేపథ్యంలో కథ మొదలవుతోంది. కొల్‌కత్తాలో ముగ్గురు అనాథలు పెట్టిబేడా సర్దుకుని పారిపోతుండగా అర్జున్ (రాజా) వారిని వెంటబడి అనాథ ఆశ్రమానికి తీసుకువస్తాడు. వారిచేత సంగీత కచేరికి ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తుంటాడు. ఆశ్రమాన్ని బెంగాలీకి చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ప్రముఖుల సమక్షంలో వీరిచేత సంగీత పోటీ నిర్వహించి ఆశ్రమానికి నిధులు సమకూర్చుకోవాలనేదే నిర్వాహకుని ప్లాన్. ఇది గ్రహించిన ముగ్గురు అనాథలు ఓ రాత్రిపూట మళ్లీ పారిపోయే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో రాజాను కొంతమంది గూండాలు చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని గ్రహించి వారు వెనక్కి వచ్చి మిగిలిన అనాథల్ని నిద్రలేపుతారు. దీంతో గూండాలు పారిపోవడం, రాజా కత్తిపోట్ల బారిన పడడం జరుగుతుంది. దీంతో రాజాను ఎవరు చంపాలనుకున్నారనే ప్రశ్న అందరికీ తలెత్తుంది. కట్ చేస్తే... రాజా ఫ్లాష్ బ్యాక్...కాలేజీ సెలవులకు హైదరాబాద్ నుంచి తన గ్రామానికి వచ్చిన రాజాకు తన మాదిరిగానే సుజాత (ఇష్టానా) కూడా వస్తుంది. సుజాత ఆ ఊరిపెద్ద కుమార్తె. రాజా తన గ్యాంగ్‌తో చేపలు పడుతుంటే... సుజాత చూసి ఆనందించి వారితో స్నేహం చేస్తుంది. ఆ స్నేహం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసి సుజాత తండ్రి తన స్నేహితుడి కొడుకు కిరణ్ (అనూప్ కుమార్)తో సుజాతకు పెండ్లి నిశ్చియం చేస్తాడు. అనూప్ కుమార్, రాజా హైదరాబాద్‌లో ఒకే కాలేజీ స్నేహితులు. ఆ విషయం సుజాతకు తెలిసినా రాజానే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది. అసలు విషయాన్ని కిరణ్‌కు చెప్పమని సుజాత అర్జున్‌కు చెబుతూ ఉంటుంది. పెండ్లి సమయం దగ్గరపడినా చెప్పకపోవడంతో అర్జున్‌పై సుజాత కోపగించుకుంటుంది. ఆఖరికి అర్జున్ తామిద్దరి ప్రేమ గురించి కిరణ్‌కు చెప్పేస్తాడు. ఇది చాలా చిన్న విషయమని, ఇద్దరి పెండ్లి తాను దగ్గరుండి చేయిస్తానని కిరణ్ మాటిస్తాడు. మరి కిరణ్ తన మాట నెరవేర్చాడా? లేదా? మరి అర్జున్ కలకత్తా వెళ్లి అనాథలను సంగీత పోటీలకు ఎందుకు సిద్ధం చేస్తున్నాడు.? అనేది చూడాలనుకుంటే... మిగిలిన సినిమా చూడాల్సిందే. సంబంధిత సమాచారం కోసం శోధించండి.