గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "స్నేహం" విలువను తెలిపే "యువత"
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
FILE
నటీనటులు... నిఖిల్, అక్ష, జయప్రకాష్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, షాయిజీ షిండే, శివన్నారాయణ, జీవ, అతిథి పాత్రల్లో సిద్ధార్థ, కృష్ణుడు (వినాయకుడు).
సంగీతం... మణిశర్మ,
ఆర్ట్... నారాయణ రెడ్డి,
నిర్మాత... హరి ఉమాప్రకాష్,
కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... పరుశురాం (బుజ్జి)

యువత మనోభావాలు తెలియజేస్తూ చాలా చిత్రాలే వచ్చాయి. అదే తరహాలో వచ్చిన ఈ"యువత" చిత్రం స్నేహం విలువను తెలియజేస్తూ మానవీయ సంబంధాలకు పెద్దపీట వేసింది. దానికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి చేసిన ప్రయత్నమే ఈ చిత్రం.

ఇక కథలోకి వెళితే... బాబు (నిఖిల్) టెన్త్ క్లాస్ తర్వాత చదువుపై శ్రద్ధపెట్టక ఆవారాగాతిరుగుతుంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కేశవపురం అనే గ్రామంలో తన మేనమామ (శివన్నారాయణ) ఇంట్లోనే ఉంటాడు.

బాబు పనులు నచ్చకపోవడంతో మేనమామ గొడవచేస్తే తన స్నేహితుల దగ్గరే ఉంటానని హైదరాబాద్ మకాం మార్చేస్తాడు నిఖిల్. ఆ ముగ్గురుకూ ఒక్కో వ్యాపకం ఉంటుంది. ఒకతను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ ఎప్పుడైనా అమెరికా వెళ్లాలని ఆలోచిస్తుంటాడు.

మరొకడు సెక్యూరిటీ గార్డ్‌గా ఉంటాడు. వారిలో ఇంకా ఇద్దరిలో ఒకరు పోలీసు అధికారిగానూ, దర్శకుడవ్వాలని ప్రయత్నాలు సాగిస్తుంటారు. అందరికీ ఏదో ఒక గోల్ ఉంటుంది. ఏ గొడవా లేనివాడు బాబు ఒక్కడే. ఈ దశలో బేబి (అక్ష) అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రేమలో పడతాడు. తన పుట్టినరోజు ఫంక్షన్‌కు వీరందరినీ బేబి ఆహ్వానించింది. ఆ సమయంలో వేరే వర్గంతో బాబు బ్యాచ్ గొడవపడతారు.

ఇదిలా ఉండగా, తాను దర్శకుడవ్వాలనే కోరిక నెరవేరిందని ఆనందంతో తన స్నేహితులకు చెబుదామని వస్తున్న బాబును గొడవ పడ్డ గ్యాంగ్ చితగ్గొడతారు. దీంతో పరిస్థితి విషమిస్తుంది. ఆపరేషన్ చేస్తేగానీ బతకడని డాక్టర్ చెబుతారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష స్నేహం విలువ యువత నిఖిల్, అక్ష, జయప్రకాష్ రెడ్డి నర్సింగ్ యాదవ్