గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » విషయంలేని "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
సినిమా... "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"
నటీనటులు.. శివాజీ, కావేరీ ఝా, బ్రహ్మానందం, బబ్లూ, విజయ్, రమాప్రభ తదితరులు.
సంగీతం.. ఆనంద్,
ఎడిటింగ్.. ఉపేంద్ర,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎం. నాగేంద్రకుమార్,
నిర్మాతలు.. కుమార్ బ్రదర్స్,
కెమేరా.. మరో.

"సినిమా రిచ్చే కానీ ప్రొడ్యూసర్ పూర్" అని మన వెబ్‌దునియా పాఠకులు చదివే ఉంటారు. సరిగ్గా ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా అదే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కథకు సంబంధంలేని పేరు, నటనకు అవకాశంలేని పాత్రలు, కామెడీ పేరుతో పరీక్ష పెట్టే సన్నివేశాలు వెరసి ఈ చిత్రం చాలా పూర్‌గా ఉందనే చెప్పాలి.

ఇక కథలోకి వెళ్తే.. సంజయ్ శాస్త్రి (శివాజీ) మంచిగా చదువుకున్న వ్యక్తి. అంతేగాకుండా గోల్ఫ్ ఆటలో ఛాంపియన్‌కూడా. ఈయనకు గొప్పింటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని యాంబిషన్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓ సందర్భంలో అమెరికా నుంచి భారతీయ సంగీతం నేర్చుకోవడానికి ఇండియా వచ్చిన శ్రావ్య (కావేరీఝా) కూడా సంజయ్ శాస్త్రి ప్రేమలో పడుతుంది.

తన తల్లిదండ్రులు అమెరికా నుంచి విహారయాత్రకు బ్యాంకాక్‌కు వచ్చారని తెలుసుకుని వారిని కలవడానికి బ్యాంకాక్ వెళుతుంది. వెళుతూ వెళుతూ తన బాయ్‌ఫ్రెండ్ అయిన సంజయ్ శాస్త్రిని కూడా తీసుకెళ్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. విమానం ఎక్కేముందు మైక్‌టైసన్‌గా పిలువబడే (బ్రహ్మానందం) వీరికి పరిచయమవుతాడు.

అనుకోకుండా వీరిద్దరి బ్యాగ్‌లు మారిపోతాయి. ఇక అక్కడ నుంచి చిక్కుల్లో పడతాడు శాస్త్రి. ఆ చిక్కులు ఏమిటి? వాటిని శాస్త్రి ఎలా పరిష్కరించుకున్నాడు? శావ్య పాత్ర ఎలాంటిది? అనేది మిగిలిన సినిమా.

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. బ్రహ్మానందం పాత్ర. గతంలో ఇదే శివాజీ చిత్రంలో మైక్‌టైసన్‌గా బాడీ బిల్డింగ్ కోచ్‌గా నటించాడు. కానీ ఈ పాత్ర అంతగా పండలేదు. ఈ సినిమాలో మరో ప్రయత్నంగా చేశారు కానీ.. ఇది ప్రేక్షకులకు ఎబ్బెట్టుగానే అనిపించింది. ఏడు తలలను నరికి బ్యాగ్‌లో పెట్టుకుంటాడు... మైక్‌టైసన్. ఆ తలకాయ గొడవేమిటి? అనేది క్లారిటీ లేకపోగా... ఏదో కామెడీగా చూపించే ప్రయత్నం చేసి బెడిసి కొట్టింది.

ఇక హీరో శివాజీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాజువల్‌గా చేసుకుంటూ పోయాడేగానీ, అతనిది ఉపయోగం లేని నటన. "నగరం" చిత్రం తర్వాత కావేరిఝా ఈ సినిమాలో తన అందాల్ని మరింతగా ఒలకపోసింది. ఇక మిగిలిన పాత్రలు పెద్దగా ప్రాధాన్యతలేనివి. కథాగమనం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ఇక సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు.

చివరిగా ఈ చిత్రం గురించి చెప్పాలంటే.. ఆంగ్ల సినిమా, హిందీ సినిమాను మిక్స్‌చేసి కొత్తగా తెలుగు సినిమా తీసే ప్రయత్నం చేశాడు. సినిమా తీసే నిర్మాతకు అవగాహన లేకపోతే ఎలా ఉంటుందనేందుకు ఈ చిత్రం నిదర్శనం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష విషయం నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ శివాజీ కావేరీ ఝా బ్రహ్మానందం బబ్లూ విజయ్ రమాప్రభ