గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » ప్రేక్షకులను ఆకట్టుకోలేని 'టార్గెట్' (target film is not satisfied)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
Target
FileFILE
గతంలో భారతీయుడు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన మర్మకళ నేపథ్యంలో ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త చిత్రమే టార్గెట్. శివబాలాజీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మర్మకళను ఉపయోగించి ఓ బాక్సర్‌ను చంపేయడం, ఆ హత్యకు సంబంధించి సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడం విశేషం.

నటీనటులు: ముమైత్‌ఖాన్, శివబాలాజీ, శ్రద్దాదాస్, కృష్ణభగవాన్, విజయరంగరాజు, వైజాగ్‌ప్రసాద్, ప్రధాన్ తదితరులు

సాంకేతికవర్గం : సినిమాటోగ్రఫీ- సురేష్‌కుమార్, మాటలు- వెలిగొండ శ్రీనివాస్, సంగీతం- కోటీ, నిర్మాతలు- దశరథ్ సంగిశెట్టి, బి. రామకృష్ణ, దర్శకత్వం- రాజ్.

పాయింట్: మర్మకళ ప్రయోగంతో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించిన కేసును హీరో పరిశోధించడం.

థ: మందాకిని (ముమైత్‌ఖాన్) ఓ నవలా రచయిత. ఆమె రాసిన ఎర్రగులాబి నవలలోని కథలో జరిగినట్టుగానే ఓ బాక్సర్ చనిపోతాడు. దీంతో ఆ నవల పాపులర్ అవుతుంది. అయితే నవలలో జరిగనట్టుగానే మర్మకళ ఉపయోగించడం వల్లే నిజమైన బాక్సర్‌కూడా చనిపోవడంతో ఇందులో ఆ రచయిత్రి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులకు అనుమానం వస్తుంది.

దీంతో పోలీస్ కమీషనర్ ఈ కేసును బోస్ (శివబాలాజీ)కి అప్పగిస్తాడు. కమీషనర్ కోరిక మేరకు చనిపోయిన బాక్సర్ హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు బోస్ మందాకినికి దగ్గరవుతాడు. అయితే తాను అనుకున్నట్టు మందాకినినే ఈ హత్య చేసింది అనేందుకు తగిన ఆధారాలేవీ బోస్‌కు లభించవు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈహత్య ఎవరు చేశారు. ఎందుకు చేశారు. ఈ హత్యను మందాకినీనే చేయించిందా అనేదే మిగిలిన సినిమా.

విశ్లేషణ: ఈ చిత్రంలో ముమైత్‌ఖాన్ ఫుల్‌లెంగ్త్ పాత్ర పోషించింది. కథను సస్పెన్స్‌గా సాగించడానికి ముమైత్ గ్లామర్ బాగానే ఉపయోగపడింది. ఈ చిత్రంలో శివబాలాజీ పోషించిన పోలీస్ పాత్ర ఎందుకో అంతగా ఆకట్టుకోదు. ఈ పాత్రకు తగినట్టు తనను తాను మలచుకోవడంలో శివబాలాజీ ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు. ముమైత్‌కు, శివబాలాజీకి మధ్య కథ నడిచేటప్పుడు మధ్యలో శ్రద్దాదాస్ వచ్చినా ఆమె అందాల ఆరబోతకే పరిమితమైంది.

ఈ మూడు పాత్రలకు మధ్యలో రొటీన్ కామిడోతో కృష్ణభగవాన్, కొండవలస, వేణుమాధవ్‌లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదేసమయంలో విలన్ చేత కామెడీ చేయించాలనుకున్న ప్రయత్నం సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. చిత్రానికి ముందు రచయిత వెలిగొండ శ్రీనివాస్ చెప్పినంత ఎఫెక్టీవ్‌గా ఈ చిత్రం అనిపించకపోవడం ప్రధాన లోపం. టెక్నికల్‌గా ఏమాత్రం వ్యాల్యూలేని ఈ టార్గెట్ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం, సినిమా, సమీక్ష, టార్గెట్, ముముత్ఖాన్, శివబాలాజీ