గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » ప్రేమ కోసం "ఆ ఒక్కడు" ఏం చేస్తాడు? (A okkadu| Ajay| Madhurima| Suresh gopi| Nazar| Sunil)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
FILE
నటీనటులు: అజయ్, సురేష్‌గోపి, మధురిమ, ధర్మవరపు, సునీల్‌, నాజర్‌, విజయచందర్ భరత్‌ తదితరులు,
కెమెరా: కమలాకర్‌,
కథ, దర్శకత్వం: మూర్తి,
సంగీతం: మణిశర్మ,
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వర్మ,
నిర్మాత: గణేష్‌ ఇందుకూరి, సుధాకర్‌.

ఇదొక సైక్రియాటిస్ట్‌ నేపథ్యంలోసాగే చిత్రం. లాయర్‌, డాక్టర్‌, క్రిమినల్‌ మధ్య జరిగే కథ. విలన్‌నుంచి హీరోగా మారిన అజయ్ నటించిన ఈ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేసే టాలీ టు హాలీ సంస్థ నిర్మించింది. విలనిజాన్ని బాగా పండించగల అజయ్ ఈ చిత్రంలో అదే తరహాలో చేసినా హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా పలు చిత్రాలు చేయాల్సివుంటుంది.

ఇక కథలోకి వెళితే... డాక్టర్‌ పవిత్ర (మధురిమ) సైక్రియాటిస్ట్‌. ఈమె తండ్రి రిటైర్డ్‌ మేజిస్ట్రేట్‌ రఘు (విజయచందర్‌). ఇకపోతే.. శ్రీ కృష్ణ (సురేష్‌గోపి) క్రిమినల్‌ లాయర్‌. ఆయనకు అసిస్టెంట్‌ బొంగరాల బుజ్జి (అజయ్). ప్రధానంగా ఈ పాత్రల మధ్య కథ సాగుతుంది. ఓసారి ఓ స్వామిజీపై నేరచరిత, అవినీతిపై ఆరోపణలు రావడంతో శ్రీకృష్ణ ఆ కేసును డీల్‌ చేస్తాడు. ఆఖరికి స్వామీజీని నిర్దోషిగా బయటకు తెస్తాడు.

మరోవైపు పవిత్రకు ఓ చెల్లెలుంటుంది. ఆమె భర్త వ్యసనపరుడు. భార్యచనిపోతే ఆస్తికోసం మామను ఇబ్బందిపెడుతుంటాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణతో పవిత్ర కలవాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించిన బుజ్జి పవిత్రపై విపరీతమైన ప్రేమ పెంచుకుంటాడు. ఆమెకు ఎటువంటి సమస్యవచ్చినా అజ్ఞాతంగా కాపాడుతుంటాడు.

ఆఖరికి మధురిమ కోసం ఇతరులను చంపడానికిక్కూడా వెనుకాడడు. ఈ విషయం తెలిసిన పవిత్ర ఇతనొక సైకో అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తుంది. ఓ సందర్భంలో ఆమె కూడా ఓ కేసులో ఇరుక్కుంటుంది. ఆమె ప్రధాన సమస్యను బుజ్జి పరిష్కరిస్తాడు. ఇక పవిత్ర ప్రధాన సమస్యకు కారణమైన వారు ఎవరు? బుజ్జి పాత్ర ఏమిటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు మూర్తి మలిచాడు. తొలిసారి దర్శకుడిగా పరిచయమైనా.. కొత్తదనంతో పలు పరబాషా చిత్రాలను సమ్మిళితం చేసినట్లు మూర్తి స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. కాకపోతే చిన్నపాటి మైనస్‌... ఎవరు హంతకుడు అనేదాన్ని సస్పెన్స్‌గా క్రియేట్‌చేయడానికి ప్రతి పాత్రపైనా అనుమానం వచ్చేలా చేస్తాడు. ఇది ఒక్కటి మినహా మిగిలిన కథంతా సాదాసీదాగా సాగుతుంది.

ఇంకా చెప్పాలంటే.. ఈ చిత్రానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం కొరవడింది. సునీల్‌, ధర్మవరపు, ఎం.ఎస్‌.ల ఎపిసోడ్లు ఏమాత్రం హాస్యాన్ని పండిచలేకపోయాయి. హాస్యంలో కొంత భాగాన్ని ఎడిట్‌ చేస్తే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా పర్వాలేదనిపిస్తుంది. అజయ్ కూడా తాను ఎక్కడా అతిగా చేయకుండా జాగ్రత్తపడ్డాడు.

డైలాగ్‌ మాడ్యులేషన్‌లోనూ విలనిజం కన్పిస్తున్నా... పాత్రతీరు రీత్యా అది కొట్టుకుపోతుంది. హీరోగా మారాలంటే ఇంకా కొన్ని చిత్రాలు చేయాల్సివుంటుంది. ఎక్కువభాగం మధురిపై సాగుతుంది. ఆమె చూడడానికి పొట్టిదయినా దర్శకుడు మూర్తి, అజయ్ ఎత్తుకు తగినవిధంగా మెస్మరైజ్‌ చేసి చూపించాడు.

మణిశర్మ సంగీతం చేయాల్సిన సినిమా ఇది కాదు. కెమెరా పనితనం బాగానే ఉంది. "ఆ ఒక్కడు"ను యాక్షన్‌ చిత్రమని ఊహించి వస్తే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. మరి.. ఆ ఒక్కడు ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో? వేచి చూడాల్సిందే..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆ ఒక్కడు, అజయ్, సురేష్ గోపి, మధురిమ, సునీల్, నాజర్