గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » తడబడిన సుమంత్ "బోణి" (Sumanth| Boni| Review| Kruthi kharabanda| Sudha)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
నటీనటులు: సుమంత్‌, కృతి, తనికెళ్ళభరణి, సుధ, చంద్రమోహన్‌, జయప్రకాష్‌రెడ్డి, గిరిబాబు, సత్యప్రకాష్‌, ఆహుతిప్రసాద్‌ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌పిప్పల,
నిర్మాత: రమణ గోగుల,
కెమెరా: ఎల్‌. ఆండ్రూ,
సంగీతం: రమణగోగుల,
పాటలు: రామజోగయ్యశాస్త్రి,
ఆర్ట్‌: ఆనందసాయి.

అనాథలైన యువకులు జీవితంలో నిలదొక్కుకోవడానికి పలు మార్గాలు అవలంబించిన అంశంపై చాలా చిత్రాలు తెరకెక్కాయి. బోణి అంటూ రమణగోగుల నిర్మాతగా మారి రాజ్‌పిప్పల అనే ఎన్‌.ఆర్‌.ఐ.ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. అంతవరకు బాగానే ఉంది. సుమంత్‌తో మాస్‌హీరోగా చూపాలనే ప్రయత్నం కాస్త రూటు మారిందనిపిస్తుంది.

ఇక కథలోకి వెళితే... అనాథలైన స్నేహితులు డిడి (సుమంత్‌), చిన్నా(త్రినేత్రుడు)లను.. ఆశ్రమంలో తల్లిగా చూసే వ్యక్తి వంటమనిషి సుధ. ఆమెచేతి వంట వీరికి పరమాన్నం. ఆమె పులిహోర చేస్తే అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్‌లో బాగా డబ్బు సంపాదిస్తే పులిహోర సెంటర్‌ పెట్టాలని వీరిద్దరు అనుకుంటారు.

అనుకోకుండా ఆమె చనిపోతుంది. ఇక ఆమె ఆప్యాయత కరువై డిడి, చిన్నాలు ఒంటరివారవుతారు. రోడ్డుమీద కొస్తారు. అక్కడే వీధిగూండాలతో పలు సమస్యలు ఎదుర్కొంటారు.

వీరిద్దరు ఒక లక్ష్యంకోసం దాచిన సొమ్ము కనిపించక పోవడంతో, చాలా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో మాఫియా ముఠాను నడిపే గిరి, దాసు (భరణి, జయప్రకాష్‌రెడ్డి) దగ్గర డిడి, చిన్నాలు పనిచేస్తారు.

వారి సలహామేరకే మంత్రి కూతురును కిడ్నాప్‌ చేస్తారు. కానీ కిడ్నాప్‌ గురైన బామ్మ ఎగిరి గంతేస్తుంది. వీరికి థ్యాంక్స్‌కూడా చెబుతుంది. దీంతో డిడి, చిన్నాలు అవాక్కవుతారు.

ఆ తర్వాత ఆమె ఎందుకు అంత సంతోషంగా ఉందని తెలుసుకోవడం..? వీరి మంచితనం గ్రహించి వీరిలో ఒకరికి మంత్రి కూతురు మనసివ్వడం జరిగిపోతాయి. మరి మంత్రి ఊరుకుంటాడా? ఏంచేశాడు? తర్వాత కథను దర్శకుడు ఎలా తెరకెక్కించాడు అన్నది సినిమా.

విశ్లేషణ: ఒకరాజు ఏడుగురు కొడుకులు కథ తెలిసిందే. దాన్ని చెప్పే విధానంలో తేడాలుంటాయి. ఈ సినిమాలో అదే లోపించింది. దర్శకుడి స్క్రీన్‌ప్లే కాస్త గందరగోళం అనిపిస్తుంది. ఇక మాస్‌పాత్రలో సుమంత్‌ను చూపించాలనుకోవడం సాహసమే. వైవిధ్యంకోసం తాను చేసే ప్రయోగమే ఇదని సుమంత్‌ ఎంత చెప్పినా 'గౌరీ' లాంటి సినిమా కొంతలో కొంత బెటర్‌.

కానీ సుమంత్‌తో మాఫియాను ఢీకొనే హీరోయిజం చేయించడం కామెడీగా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది హీరోయిన్ కృతికరబంద గురించి. కొల్‌కతాకు చెందిన అమ్మాయే అయినా మొహమాటంలేకుండా చక్కగా అభినయించింది. పోలీసుగా హర్షవర్ధన్‌ పర్వాలేదనిపంచాడు.

ఆండ్రూస్‌ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. రమణగోగుల సంగీతం సోసోగా ఉంది. అంతా లోకల్‌ టాలెంట్‌ను చూపించారు. టెక్నికల్‌గా చక్కటి ఫలితాలన్నిచ్చినా.. ప్రేక్షకుడ్ని మమేకం చేసే ప్రయత్నంలో కాస్త బోణి కాస్త తడబడిందని చెప్పాలి. మరి ఏ మేరకు బోణి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో? వేచి చూడాల్సిందే..!
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సుమంత్, బోణి, రివ్యూ, కృతి కరబంద, రాజ్పిప్పల, గిరిబాబు, సుధ