విశ్లేషణ: గత ఏడాది "కాళిదాసు" చిత్రంతో నాగార్జున కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ ఆ చిత్రంలో మాస్ తరహా పాత్రను నెట్టుకొచ్చాడు. "కరెంట్" అనేది కాస్త క్లాస్ టచ్ ఉన్న సబ్జెక్ట్. దీనిలో కాస్త హావభావాలు, అభినయాలు తగినట్లుగా చూపించాలి. ఆ విషయంలో ఇంకా సుశాంత్ పరిణతి చెందలేదు. ఫుల్‌గా తాగి రోడ్లపై న్యూసెస్ క్రియేట్‌చేసే సన్నివేశం కృతంగా ఉంది.
నటనకు చక్కని అవకాశం గల సబ్జెక్ట్ ఇది. ఇక స్నేహ ఉల్లాల్ తొలి చిత్రమే ఉల్లాసంగా ఉత్సాహంగాతో సక్సెస్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. పాత్రపరంగా ఆమె పోషణ పర్వాలేదు.
స్నేహ స్నేహితులుల్లో విజరు, వెన్నెలకిషోర్ ప్రధానం. విజరు పంచ్ డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. కిషోర్ లవ్‌ట్రాక్ కాస్త నవ్వు పుట్టిస్తుంది. ఎరోనాటికల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం పాత్రకంటే వాచ్‌మెన్ పాత్రలోనే హాస్యాన్ని పండించాడు. సగటు తల్లిదండ్రులుగా భరణి, సుధ కన్పిస్తారు. కొడుకునే వెనుకేసుకొచ్చే పాత్రలో సుధ చక్కగా నటించింది.
మధ్యమధ్యలో రేప్ చేస్తానంటూ.. వచ్చే రౌడీగా షఫీ, 'జామ్‌కాయలో..' అంటూ అమ్మే వ్యక్తిగా రఘుబాబు పాత్ర పోషణలు ఎంటర్‌టైన్ చేస్తాయి. బ్రోతల్ హౌస్ నడిపే షకీలా మాస్ ప్రేక్షకులికి విందు చేస్తుంది.
సాంకేతిక విభాగానికి వస్తే.. విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం, దేవీశ్రీప్రసాద్ సంగీతం బాగున్నాయి. 'కరెంట్... అనే టైటిల్‌సాంగ్ క్యాచీగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కణల్ కన్నన్ సీక్వెన్స్ హీరో, షఫీపై సాగేవి రియలిస్టిక్‌గా ఉన్నాయి.
దర్శకుడిగా సూర్యప్రతాప్‌కిది మొదటి సినిమా. కథలో విభిన్నమనుకుని మనసులోని ప్రేమను తుడిచే అంశాన్ని కాన్సెప్ట్‌గా ఎంచుకున్నాడు. ఇది కాస్త గందరగోళంగా ఉందని సినిమాలో స్నేహ స్నేహితులచేత చెప్పిస్తాడు కూడా. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాను తీయాలనుకునే నిర్మాతలను మెచ్చుకోవాలి.
పకడ్బంధీగా స్క్రిప్ట్‌లేకపోవడం.. దాన్ని గమనంలో కొత్తగా చూపించలేకపోవడం కొరవడింది. తనపై అసహ్యం పెంచుకోవడం కోసం సుశాంత్‌చే మందు తాగించడం, వ్యభిచారం చేయించడం.. ఆఖరికి ఎరోనాటిక్ సెమిస్ట్ పరీక్ష రాయకుండా అడ్డుపడడం... వంటి సన్నివేశాలను దర్శకుడు ఇంకాస్త కొత్తగా చూపిస్తే బాగుండేది.
ప్రధానంగా ప్రేమించుకోవడం, విడిపోవడం.. అనేవి ఫీల్ కలిగించలేకపోవడం స్క్రీన్‌ప్లే తప్పిదమే. ఎక్కడ సినిమా ప్రారంభమయితే అక్కడే ముగింపు పలకడం... బాగున్నా... లో ఓల్టేజ్ వల్ల బల్బు వెలుగు డిమ్‌గా ఉన్నట్లుంది. మరి కరెంట్ ఏ మేరకు ప్రేక్షకులకు షాక్ ఇస్తుందో? వేచి చూడాల్సిందే మరి..!