గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "ఎవరైనా ఎప్పుడైనా" తప్పుచేయొచ్చు! (Evarina Eppudaina | Varun Sandesh | Vimala Raman | Rishi | Rahu)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
కథలోకి వెళితే...
రొటీన్‌గా తెలుగు సినిమాల్లో హీరోకు ఉండే డ్యూటీనే... పెద్దగా పనుండదు. హాయిగా ఎంజాయ్ చేస్తూ తిరిగే యువకుడు వెంకట్‌(వరుణ్‌సందేశ్‌). చిన్నా పెద్దా తేడాలేకుండా పరాచకాలు ఆడుతూంటాడు. అమ్మమ్మకు బాగోలేకపోతే ఆసుపత్రిలో సపర్యలు చేస్తాడు. అదే ఆసుపత్రిలో పక్కనే మధుమిత (విమలారామన్‌) తన నానమ్మకు బాగోకపోతే వస్తుంది. ఆమెను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని వెంకట్‌ ప్రయత్నాలు చేస్తాడు. కానీ వెంకట్‌ చేసిన పొరపాటు వారి కుటుంబంలో కల్లోలం సృష్టిస్తుంది.

మధుమిత అక్క నిశ్చితార్థం ఆగిపోతుంది. దాన్ని సరిదిద్దుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఆమెకు అసలు విషయం తెలిసి ఏం చేసింది? వెంకట్‌ మారాడా? అనేదే సినిమా. కథగా చెప్పాలంటే పెద్దగా లేదు. చివరికి మధుమితను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడనేది కథ.

నటుడిగా చెప్పాలంటే హ్యాపీడేస్‌ అంత ఈజ్‌ ఉన్నా వరుణ్‌సందేశ్‌లో మాటిమాటికీ చేతులు ఊపడం. వెంట్రుకల్లో చేతులు పెట్టే మేనరిజం తగ్గించుకోవాలి. యువకుడిగా ఉండే ఎనర్జీ ప్రకారం తన పాత్రకు న్యాయం చేశాడు. సంభాషణలు పలకడంలో కాస్త మెరుగు కనబరిచాడు.

ఇక విమలారామన్‌ బయట చూడ్డానికి పెద్దావిడిలా ఉన్నా సినిమాకు సరిపోతుందని దర్శకుడు మొదట్లోనే చెప్పాడు. కానీ ఆ విషయం సినిమాలోనూ కన్పించింది. ఆమె బాడీ లాంగ్వేజ్‌ వరుణ్‌కు సరిపోలేదు. కథను నడపడంలో మిగిలిన తారాగణం కాస్త తోడ్పడతారు. హీరోయిన్‌ అక్కగా రేష్మి తనపాత్రకు న్యాయం చేసింది. సెపరేట్‌ కామెడీ ట్రాక్ పెట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది.

మణిశర్మ సంగీతం సోసోగానే ఉంది. మణిశర్మకూడా కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. కానీ ఆ డెప్త్‌ అందులో లేదు. క్లైమాక్స వరకు హీరో తనను ప్రేమిస్తున్నాడనే విషయం తెలియకపోవడం పెద్ద విచిత్రం. ఇంటర్‌వెల్‌ సరైనచోట పడలేదు.

యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఏదో చేయబోయి ఏదో చేసినట్లుంది. కొన్ని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. పతాక సన్నివేశమే సినిమాకు లోటు. ఎన్నో సినిమాలకు ఎడిటింగ్‌ చేసిన మార్తాండ్‌ కె. వెంకటేష్‌ తన స్వంత సినిమా.. (అంటే అన్ని బాధ్యతలు అయనే తీసుకున్నాడు.) వచ్చేసరికి ఎడిటింగ్‌ కొన్ని లోపాలున్నాయి. అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

కనీసం హరోయిన్‌ అక్క రేష్మి హీరో విషయం చెప్పినప్పుడు ఆశ్చర్యపోవడం దగ్గర ఇంటర్‌వెల్‌ పడితే బాగుండేది. అలాగే వానపాటలో ఎడిటింగ్‌ అర్థంకాదు. సాంకేతికపరంగా కాస్త ఫర్వాలేదనిపించినా... ప్రేక్షకుడ్ని మమేకం చేసే అంశాలు, కథనం లేకపోవడం మైనస్సే... మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాల్సిందే.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎవరైనా ఎప్పుడైనా, వరుణ్ సందేశ్, విమలారామన్, రిషి, రాహుల్, అనుహాసన్, గిరిబాబు, అలీ, సురేఖావాణి, వేణుమాధవ్, రమాప్రభ, కోట, బ్రహ్మానందం