గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌నిచ్చే "ఆ ఇంట్లో" (Aa Intlo| Cinema| Review| Thrilling| Chinna| Mayuri| AVS)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
చిత్రం: ఆ ఇంట్లో
నటీనటులు: చిన్నా, మయూరి (ఆషాశైనీ), ఎవీఎస్‌, కృష్ణభగవాన్‌, రామ్‌జగన్‌, కోటశ్రీనివాసరావు తదితరులు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిన్నా,
నిర్మాతలు: నరేదుల శ్రీనివాసరెడ్డి, పి.రాజు చౌదరి, పి. మనోజ్‌ కుమార్‌రెడ్డి, ఎ. జితేందర్‌రెడ్డి,
కెమెరా: సుధాకర్ రెడ్డి,
ఎడిటింగ్‌: కృష్ణారెడ్డి,
సంగీతం: కోటి.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'శివ'తో నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన "చిన్నా" ఆయన అడుగుజాడల్లోనే దర్శకునిగా మారి 'ఆ ఇంట్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. తన ఒరిజినల్‌ పేరు జితేందర్‌రెడ్డి అనేది నిర్మాతల్లో ఒకరిగా వేసుకున్నాడు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి తీసిన సినిమా ఇది.

నటునిగా పక్కవారిని ఎక్కువగా పరిశీలించే చిన్నా వారిలో ఇంకా టాలెంట్‌ ఉందనీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తూ తనే దర్శకుడైతే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ చిత్రానికి దర్శకత్వం చేసి సక్సెస్‌ అయ్యాడు. హార్రర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళే వాళ్ళకూ ఆ ఇంట్లో చిత్రం తీసి నచ్చే ప్రయత్నం చేశాడు.

భార్య పల్లవి (మయూరి) ఇద్దరు పిల్లలతో హాయిగా కాపురం చేసే పవన్‌ (చిన్నా)కు తన భార్యకు హిస్టీరియా వస్తే ఆసుపత్రిలో జాయిన్‌ చేస్తాడు. ఆమె పరిస్థితి గమనించిన డాక్టర్‌ వైవాహిక జీవితంలో ఆమెకు దూరంగా ఉండాలనే సలహా ఇస్తాడు. కానీ భర్త ప్రవర్తనను గమనించి, సరైన కారణం తెలీక పల్లవి ఆయనపై అనుమానిస్తుంది.
WD

ఆ అనుమానంతో ఇంట్లో ఉన్న పనిమనిషిని కూడా గెంటివేస్తుంది. దీంతోపాటు ఇంట్లో పూజించే తులసిచెట్టు మోడిబారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో? అర్థంకాక మళ్ళీమళ్ళీ తులసి మొక్కను మారుస్తుంటారు. కానీ ఈ ఇంటిలో ఏదో గాలి సోకిందని పవన్‌ స్నేహితుడు రామ్‌జగన్‌ పండితుడు ఏవీఎస్‌‌ను తీసుకువచ్చి శాంతి చేయిస్తాడు.

తులసి ఇలా మారడానికి ఎంతటివారైనా కారణమైతే తాను గీసిన సర్కిల్‌లో తెల్లవారిలోగా పడిపోతారని చెబుతాడు. కానీ మరుసటిరోజు ఆయనే శవమై ఆ సర్కిల్‌లో పడి ఉంటాడు. ఇవన్నీ ఆ చుట్టుపక్కల తిరిగే అఘోరా పరిశీలిస్తుంటాడు. ఓసారి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తే పల్లవి భయపడి తరిమేస్తుంది.

ఇంటిలో సుఖసంతోషాలు లేవని తెలుసుకున్న రామ్‌జగన్‌ పవన్‌‌ను తీసుకుని ఆస్ట్రాలజర్‌ (కోట) దగ్గరకు తీసుకెళతాడు. అక్కడ పల్లవి జాతకాన్ని పరిశీలించమని ఆమె జాతకాన్ని చూపిస్తారు. ఈ జాతకం గల అమ్మాయి ఎప్పుడో చనిపోయిందని చెబుతాడు? మరి ఆ ఇంటిలో పల్లవి ఎవరు? నిజంగా ఆమె చనిపోయిందా? ఆ ఇంటిలో ఏం జరుగుతుంది? చివరికి ఏమైయింది? అనేది చిత్రంలో చూడాల్సిందే.

హాలీవుడ్‌ చిత్రాలను తలపించేలా చిన్నా దర్శకుడిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ సన్నివేశం బోర్‌కొట్టకుండా చూపాడు. కథ, కథనం ఆసక్తికరంగా మార్చడంలోనూ, పరిమిత నటీనటులతో ఒకే ఇంటిలో చిత్రాన్ని చూపించి మెప్పించడం విశేషమే. నటుడిగా తనేంటో నిరూపించుకున్న చిన్నా.. మయూరిని నటిగా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమపడ్డాడు. ఆమె నటన ఈ సినిమాలో బయటపడింది.

ఇకపోతే.. సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌. మాంత్రీకుడిగా వినోద్‌కుమార్‌, స్వామిజీగా భిక్షు పాత్రలు కథనాన్ని నడపంలో తోడ్పడ్డాయి. ప్రతి ఆర్టిస్టు పరిమితంమేరకే నటించారు. ముఖ్యంగా కోటి రీరికార్డింగ్‌ హైలైట్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఎపిసోడ్‌లో గ్రాఫిక్స్ థ్రిల్‌ కలిగిస్తాయి. మొత్తాన్ని థ్రిల్‌ కల్గించే చిత్రం చూశామన్న ఫీలింగ్‌ కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆ ఇంట్లో, సినిమా, రివ్యూ, థ్రిల్లింగ్, చిన్నా, మయూరి, ఏవీఎస్