రవితేజ చిత్రాలంటేనే ఎనర్జిటిక్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతూ వెటకారపు మాటల్తో ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు. అదే కోవలోనే ఆంజనేయులు ప్రయత్నించాడు. కిక్ సినిమా తర్వాత వెంటనే అదే తరహాలో చేసిన ఆంజనేయులులో రవితేజ నటన రొటీన్‌గానే ఉన్నా తల్లిదండ్రుల సెంటిమెంట్‌ను తగిలించాడు. బహుశా ఈ చిత్రంలోనే తొలిసారిగా రవితేజ ఏడ్చిన సన్నివేశాలున్నాయోమో. ఇది పూర్తిగా హీరోబేస్డ్ సినిమా.
ప్రతి చిత్రంలోనూ అల్లరిగా ఆటపట్టించే వ్యక్తిత్వంగల రవితేజ క్యారెక్టర్ ఆంజనేయుల్లోనూ ఉంటుంది. ఆంజనేయులు (రవితేజ) హెచ్.ఎం.టీవీ ఛానల్‌లో రిపోర్టర్. కెమెరామెన్‌గా బ్రహ్మాజీ. క్రియేటివ్ హెడ్ బ్రహ్మానందం. మొబైల్ కంపెనీలో అంజలి (నయనతార) పనిచేస్తుంది. ఓ సందర్భంలో పరిచయమై మొదటిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు ఆంజనేయులు.
ఇక వృత్తిపరంగా సిటీలో మాఫియా లీడర్ బడా (సోనూసూద్) వ్యవహారాల్ని గమనిస్తుంటాడు ఆంజనేయులు. ఆ క్రమంలో బస్ ప్రమాదంలో అందరూ చనిపోయిన ఉదంతం వెనుక బడాతోపాటు పలువురు రాజకీయనాయకులు, అధికారులు ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత బడా మాఫియా గ్యాంగ్‌లో పవన్‌గా పేరు మార్చుకుని అక్కడ విషయాలన్నీ రాబట్టుకుంటాడు. (ఇదంతా పోకిరి సినిమా ఎపిసోడ్‌లా ఉంటుంది). చివరగా బడాను అతను వెనుక ఉన్నవారిని ఎలా శిక్షించాడు అన్నది మిగిలిన సినిమా.
రవితేజ ఎనర్జిటింగ్‌పైనే సినిమా అంతా నడుస్తుంది. భావోద్వేగాన్ని చక్కగా కనబరిచాడు. రిపోర్టర్‌గా వృత్తి ధర్మాన్ని ఎంత జోవియల్‌గా నిర్వర్తించాలో చక్కగా చూపాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం రవితేజ మొహం పీక్కుపోయినట్లుగా కన్పిస్తుంది. ఇక నయనతార విషయంలోనూ అదే. గత చిత్రాల్లో ఉన్న గ్లామర్ ఈ చిత్రంలో కనిపించలేదు. మేకప్ వేసుకోవడం మరిచిపోయిందా.. అనిపిస్తుంది. పెర్‌ఫార్మెన్స్‌కు ఏ మాత్రం అవకాశంలేని పాత్ర. హీరోకు హీరోయిన్‌గా మాత్రమే ఉంటుంది.