డాడీ కూల్

బ్యానెర్ : మారుతి ఇంటర్నేషనల్
నిర్మాత : మారుతి ఇంటర్నేషనల్
దర్శకత్వం : కే. మురళీ మోహన్ రావు
సంగీతం : రాఘవ్ సచ్చర్
కళాకారులు: సునీల్ శెట్టి, ఆరతీ ఛాబరియా, ఆశీష్ చౌధరీ, ట్యూలిప్ జోషీ, ఆఫ్తాబ్ శివదాసానీ, జావేద్ జాఫరీ, కిమ్ శర్మ, తదితరులు.
సినిమా చివరిలో ఏముంటుంది. ట్రాజెడీ, దుఖంతో కూడుకున్న మాటలు, కాసేపు నిశ్శబ్దం, కాని ఈ చిత్రంలో స్టీవన్ లాజరస్(సునీల్ శెట్టి) తండ్రి శవానికి దహన సంస్కార కార్యక్రమాలు పూర్తి చేస్తుండగా ఓ వేరొక మనిషి శవాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుంది. కామెడీగా ఉండదు...
స్టీవన్ ఓ గొప్ప రచయిత కావాలని కోరుకుంటుంటాడు. తన తండ్రి చివరి క్షణాలల్లో అతని వీడ్కోలు ఇలాగే పలకాలనుకుంటుంటాడు. తన తండ్రి మరణానంతరం ఓ గేయాన్ని ఆలపించి వీడ్కోలు పలకాలనుకుంటాడు. దహన సంస్కారాల ఏర్పాట్లు చేసే ఓ వ్యక్తి తన తండ్రి శవానికి బదులుగా మరో శవాన్ని పంపడం జరుగుతుంది. ఇక్కడ ట్రాజెడీ కామెడీగా మారిపోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.