గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "గణేష్" (జస్ట్).. ఓ సిల్లీ సినిమా మాత్రమే..! (Ganesh Cinema Review| Ram| Kajal Agarwal| Poonam Kaur| Ashish Vidyarthi| Brahmanandam)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
Ganesh
WD
నటీనటులు: రామ్, కాజల్ అగర్వాల్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, విశ్వనాథ్ కాశీ, సమీర్, సుధ, పూనమ్‌కౌర్, సురేఖావాణితో పాటు 26 మంది పిల్లలు.
విడుదల: 24.09.09,
పతాకం: శ్రీ స్రవంతి మూవీస్,
సంగీతం: మిక్కీ జేమేయర్,
ఫైట్స్: పీటర్ హేన్స్,
నిర్మాత: రవికిషోర్,
దర్శకత్వం: శరవణన్.

పాయింట్: పెళ్ళయిన తర్వాత అర్థంచేసుకోవడం కంటే అర్థం చేసుకుని పెండ్లి చేసుకోవడమే బెటర్ అనేది పాయింట్.

దేవదాస్ తర్వాత రామ్ నటించిన చిత్రం "రెడీ". ఈ రెండు చిత్రాల్లో ఈజీ, ఫాస్ట్ నటుడిగా రామ్ గుర్తింపు పొందాడు. రవికిషోర్ బేనర్‌నుంచి వచ్చిన రెండో చిత్రమిది. "గణేష్"కు జస్ట్ గణేష్ అనే టాగ్‌లైన్‌కూడా పెట్టారు. ఎందుకంటే..? రామ్ (గణేష్) నవతరం అభిరుచులున్న యువకుడు. అలాగే ఈ సినిమాకూడా "జస్ట్" సినిమాగే ఉంటుంది. రొటీన్ ఫార్మూలాలకు భిన్నంగా 26మంది పిల్లలతో ఎంటర్‌టైన్ చేయిస్తూ సాగతీతగా దర్శకుడు శరవణనన్ తెరకెక్కించారు.

కథలోకి వెళితే.. తన స్నేహితుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంట్లోవారంతా అత్తకూతురునిచ్చి పెండ్లిచేయాలని నిర్ణయిస్తారు. ఈ విషయం తెలిసిన గణేష్ స్నేహితుని అత్తకూతురిని ప్రేమిస్తున్నట్లు నటిస్తానని, అప్పటికి నీ పెళ్లి క్లియర్ అవుతుందని గణేష్ చెబుతాడు. అనుకున్నట్లుగానే.. సిటీలో ఎక్స్‌ప్రెస్ అపార్ట్‌మెంట్‌లో 801లో తన అన్న, వదినలతో ఉంటున్న దివ్య (కాజల్ అగర్వాల్)ను ప్రేమించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.

అందులో భాగంగానే ఆ అపార్ట్‌మెంట్‌లోని 26మంది పిల్లలకు దగ్గరవుతాడు. వారు కూడా దివ్య ప్రేమకు సహకరిస్తారు. దివ్య ప్రేమిస్తుంది. కానీ గణేష్ తనను ప్రేమించడం లేదని, జస్ట్ నటిస్తున్నాడని తెలిసి అసహ్యించుకుంటుంది. కానీ గణేష్ నిజంగానే దివ్యప్రేమలో పడిపోతాడు. ఎన్నిచెప్పినా దివ్య నమ్మదు. ఆమెను నమ్మించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో పిల్లల ప్రేమకు కూడా దూరమవుతాడు. అప్పుడు తనకొచ్చిన కొత్త ఐడియాతో ఆమె మనసు మార్చాలని ప్రయత్నిస్తాడు. అది ఏమిటి? ఎలా దివ్య ప్రేమను పొందగలిగాడు? అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ: రామ్ పాత్రపరంగా తనలోని ఈజీనెస్‌ను బాగా చూపాడు. అందులో ఓకే. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న 26మంది పిల్లలను నమ్మించడానికి తను చేసిన ప్రయత్నాలు, జిమ్మిక్కులు కాస్త నవ్వు తెప్పిస్తాయి.

దివ్యకోసం వెంటబడుతూ.. దొడ్డిదారిని వెళుతూ పైప్‌లతో పైకిపాకుతున్న గణేష్‌ను చూసి పిల్లలంతా సూపర్‌మేన్‌గా పిలుస్తుంటే.. సూపర్‌మేన్ చేసే విన్యాసాలు సత్యానికి దూరమైనా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఒక అపార్ట్‌మెంట్‌నుంచి మరో అపార్ట్‌మెంట్‌కి దూకడం, బంతికోసం ఎత్తైన అపార్ట్‌మెంట్ నుంచి కిందకి దూకడం వంటి సన్నివేశాలు హీరోయిజానికి ఏమాత్రం ఉపయోగపడవు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గణేష్, సినిమా, రివ్యూ, రామ్, కాజల్ అగర్వాల్, పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం