గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "నిన్ను కలిశాక" అంతే సంగతులు..! (Ninnu Kalisaka Cinema Review| Chaitanya| Krishnudu| Happy Days| Santosh)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
Ninnu Kalisaka Cinema Review
WD
నటీనటులు: చైతన్య, సంతోష్, దీపా షా, ప్రియ, కృష్ణుడు, తరుణ్ మాస్టర్, వినయ్ వర్మ, సందీప్, మాస్టర్ భరత్, సుభాషిణి, సరస్వతి, ప్రదీప్ తదితరులు.
సంగీతం: సునీల్ కాశ్యప్,
మాటలు: లక్ష్మీ భూపాల్,
పాటలు: వనమాలి,
సమర్పణ: రామోజీ ఫిలింసిటీ,
నిర్మాత: రామోజీరావు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగేశ్వర రావు.

పాయింట్: ఎప్పుడూ కలిగేది ఆకర్షణ.. ఒక్కసారి కలిగేది ప్రేమ... అందుకే "ప్రేమను ప్రేమించు".. అనే పాయింట్‌కు కథగా మలిచిన సినిమా ఇది.

ఇండస్ట్రీలో కథల కొరత ఉంది అనేది కొన్ని సినిమాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే మన చుట్టూనే చాలా కథలే ఉన్నాయి. వాటిని తీసేందుకు సరైన దర్శకుడు లేడనిపిస్తుంది. "నిన్ను కలిశాక" చూశాక దర్శకుడిలోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఈనాటి యువత అంటేనే పెద్దలక ఒక దురభిప్రాయం ఉంటుంది.


ఒక ఆడ, మగ కలిసి మాట్లాడుకున్నా, తిరిగినా ఇద్దరి మధ్య ఉండేది "అదే"నని అనుకుంటారు. మరోరోజు వారే వేరేవారితో ఉంటే బరితెగించారని, ప్రేమ అనేపదాన్ని దుర్వినియోగం చేస్తూ పాశ్చాత్యపోకడలతో మన కట్టుబాట్లను కలుషితం చేస్తున్నారని విమర్శిస్తుంటారు. కానీ నేటి యువతకు జీవితంపైనా, ప్రేమపైనా సరైన స్పష్టత ఉంది. స్నేహం అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? అనే విషయాల్లో క్లారిటీ ఉంది.. అని చెప్పే ప్రయత్నమే 'నిన్ను కలిశాక'.

చైతన్య (చందు), ప్రియ (బిందు) ఓ జంట. సంతోష్ (అభిరామ్), దీపా షా (దీప్తి) మరో జంట. సాఫ్ట్‌వేర్‌కు చెందిన ఓ ప్రాజెక్ట్ విషయమై అభిరామ్, బిందు హైదరాబాద్ నుంచి యు.ఎస్. వెళతారు. ఒకరినొకరు అనుకోకుండా యు.ఎస్‌లో కలుసుకుని స్నేహితులుగా మారతారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉండే చందు, దీప్తిలు ఒకరినొకరు ఓ సందర్భంలో కలుసుకుంటారు. వారి మధ్య కూడా స్నేహం కుదురుతుంది.

చందు పెయింటింగ్ చేయడమే గాకుండా.. డాన్స్ పోటీల్లోకూడా పాల్గొంటాడు. అలా ఓ సారి టైటానిక్ డ్యాన్స్‌లో దీప్తితో పాటు పాల్గొంటాడు. మరోసారి మరో డాన్స్‌లో ఇద్దరూ పాల్గొని ఫస్ట్‌ప్రైజ్ గెలుచుకుంటారు. ఆ డాన్స్‌లో.. చందు, దీప్తిలు ప్రేమికులుగా జీవించారని జడ్జిలు కితాబిస్తారు.

ఇక యు.ఎస్‌లో తెలుగువారైన అభిరామ్, బిందులుకూడా ఒకే ఆఫీసులో పనిచేయడం వల్ల వారూ స్నేహితులుగా మరింత దగ్గరవుతారు. ఆ స్నేహం ప్రేమవైపు మొగ్గుచూపుతుందా? అనిపించేంతగా ఉంటుంది. ఎందుకంటే బిందు ప్రేమికుడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ ఇవ్వదు.

అది రీతిలో అభిరామ్ కూడా ఉంటాడు. ఇక ప్రాజెక్ట్ వర్క్ పూర్తయి ఇండియా వచ్చే సందర్భంలో అభిరామ్ బిందుపై తనకున్నది ప్రేమ, ఆకర్షణ అనే సంఘర్షణలో మదనపడుతుంటాడు. ఆ సమయంలో అదే విమానంలో జగపతి బాబు కన్పిస్తాడు. ఏదో షూటింగ్ ముగించుకుని వస్తున్న అతని వద్ద అభిరామ్ తన సంఘర్షణ గురించి చెబుతాడు.

దాంతో జగపతిబాబు ఆశ్చర్యపోయి నిజమైన ప్రేమైతే హృదయంతో ఆలోచించని ఓ చీటీరాసి ఇస్తాడు. అది ఇండియా వెళ్ళాక చదవమని చెబుతాడు. అది ఏమిటి? ఆ తర్వాత నలుగురు ప్రేమ ఎంతవరకు వచ్చింది.? ఎవరు ఎవర్ని ప్రేమించారు..? అసలు దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నిన్ను కలిశాక, సినిమా, రివ్యూ, చైతన్య, సంతోష్, కృష్ణుడు, హ్యాపీడేస్