గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » వీధి రౌడీని "మహాత్మా" అడుగు జాడల్లో నడిపించిన కృష్ణవంశీ (Mahatma Cinema Review | Srikanth | Charmi | Bhavana | Krishna Vamsi | Navaneet kour | Jaya Prakash Reddy)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
నటీనటులు: శ్రీకాంత్‌, భావన, ఛార్మి, నవనీత్‌కౌర్‌, ఉత్తేజ్‌, ఆహుతి ప్రసాద్‌, జయప్రకాష్‌రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, రాంజగన్‌, బ్రహ్మానందం, జ్యోతి, ఎం.ఎస్‌. చౌదరి, నాయుడ గోపి, జయవాణి, సుభాషిణి, రాధాకుమారి తదితరులు

కెమెరా: శరత్‌, సంగీతం: ఆంథోని, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణవంశీ, నిర్మాత: సి.ఆర్‌. మనోహర్‌, కథ, కథానువాదం, దర్శకత్వం: కృష్ణవంశీ.

పాయింట్‌: వీధి రౌడీ మహాత్మాగాంధీ గురించి తెలుసుకుని ఆయన బాటలోనే రాజకీయాల్లో ప్రవేశించడం.

కృష్ణవంశీ చిత్రాలంటే ఒక గులాబి, శశిరేఖా పరిణయం, ఖడ్గం వంటివే కాకుండా నేటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలనేదానిపైనా గురి పెట్టడం జరుగుతుంటుంది. ఆ కోవలోనిదే మహాత్మా. ఏం చేస్తే మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేరుస్తామనేదానిపై టార్గెట్‌పెట్టి చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసిన చిత్రమే మహాత్మా.

మామూలుగా కృష్ణవంశీ చిత్రాలంటే ఫస్టాఫ్‌ బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండాఫ్‌ వచ్చేసరికి పేలవంగా ఉంటుందనే ముద్ర ఉంది. అందుకే ఎక్కడ గాడితప్పుతానోనని ప్రత్యేకంగా పరుచూరిబ్రదర్స్‌ను ఎన్నుకుని వారితో కలిసి పనిచేశాడు. సంభాషణల్లోనూ, కథాగమనంలోనూ, క్లైమాక్స్‌లోనూ పరుచూరి బ్రదర్స్‌ ముద్ర గోచరిస్తుంది. ఒక వీధి రౌడీ మామూలు మనిషిగా మారడం అక్కడున్నవారికి సేవ చేయడం మామూలే. కానీ ఆ రౌడీ మహాత్ముని బాటలో పయనిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడన్న పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పేప్రయ్నతం చేయడం విశేషం.

కథలోకి వెళితే... దాస్‌ (శ్రీకాంత్‌) ఒక ఊరిలో గాంధీ బొమ్మసెంటర్‌లో గూండా గిరీ చేస్తుంటాడు. చిన్నాచితకా తప్పుడు పనులుచేయడం కోర్టుకు హాజరుకావడం మళ్ళీ వచ్చేయడం అతని విధి. ఆ ఊరిలో ఫ్యాబ్‌ సిటీ స్థాపించడానికి ప్రారంభోత్సవం చేస్తుంది స్థానిక పార్టీ నాయకురాలు కళారాణి (జ్యోతి). అదే పార్టీకి చెందిన ఎం.ఎల్‌.ఎ. దాదా (జయప్రకాష్‌రెడ్డి) ఫ్యాబ్‌ సిటీ కడితే నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని రభసచేసి వాయిదా వేయిస్తాడు.

ఓ స్థల వివాదంలో దాదా కొడుకునే దాస్‌ ఎదిరించి పరిష్కరిస్తాడు. ఆ సంఘటనలో పోలీసులు దాస్‌ను అరెస్ట్‌చేస్తే లాయర్‌ కృష్ణవేణి (భావన) బెయిల్‌ ఇప్పిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అక్కడి హీరోకు జరిగే మర్యాదలు చూసి వెంటనే హీరో అయిపోవాలనే నిర్ణయానికి వస్తాడు దాస్. హీరో అభిమానినని దాస్‌ సదరు హీరోను అత్యుత్సాహంతో కలిసి మీదపడతాడు. దీంతో హీరో దాస్‌ను అసహ్యించుకుని చెంపదెబ్బ కొడతాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న దాదా దాస్‌ను పిలిపించి నీలాంటి కార్యకర్త నా వద్ద వుంటే అభివృద్ధిలోకి తీసుకవెళ్లి హీరోని చేస్తానంటాడు. ఆ తర్వాత దాస్‌ను తన దందాలకు ఉపయోగించుకుంటాడు దాదా. సినిమా హీరోకంటే రాజకీయాల్లోకి వస్తే బోల్డంత డబ్బని చెబుతాడు. ఆ క్రమంలో దాస్‌ మనసు రాజకీయాలవైపు మళ్లుతుంది. ఎలక్షన్లు దగ్గరబడతాయి. గాంధీనగర్‌ నియోజకవర్గం-1కి ఎం.ఎల్‌.ఎ.గా దాదాను ఎంపికచేస్తుంది పార్టీ. గాంధీనగర్‌-2 నియోజకవర్గానికి మరొకతన్ని ఎంపిక చేస్తుంది. ఆల్‌రెడీ ఆమె ఉన్న నియోజకవర్గానికే కళారాణి ఎంపికవుతుంది.

ఈ ఎంపికలో దాదాకు, కళారాణికి వాగ్వివాదం ముదురుతుంది. తనకు 250 కోట్లు ఇస్తే ఫ్యాబ్‌ సిటీ గొడవనుంచి తప్పిస్తానని అప్పటికే దాదా అంటాడు. చేసేది లేక ఆవేశపూరితుడైన దాదా కొడుకుచేత ఒకరిని హత్యచేయించి జైలుకు వెల్లేలాచేస్తుంది. ఆ హత్య దాస్‌మీద వేసుకుంటే... తన కొడకు బయటకు వచ్చి గాంధీనగర్‌-2కు ఎం.ఎల్‌.ఎ. అవుతాడని చెబుతాడు. దీన్ని దాస్‌ వ్యతిరేకించి ఛాలెంజ్‌ చేసి బయటకు వచ్చి 'మహాత్మా పార్టీ' పెడతాడు. కానీ మాంసం, మందు లేనిదే ఉండని దాస్‌... మహాత్ముని పార్టీ రిజిస్ట్రేషన్‌ చేయాలంటే ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలని చెబుతుంది.

గాంధేయవాది అయిన రాంజగన్‌ను ఆశ్రయించి మహాత్ముని గురించి తెలుసుకుంటాడు దాస్‌. కానీ ఆ తర్వాత అన్నీ కష్టాలే. అవి ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? కృష్ణవంశీ మహాత్మ పేరుతో ఏం చెప్పదలచుకున్నాడు? అన్నది సినిమా.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మహాత్మ, కృష్ణవంశీ, శ్రీకాంత్, భావన, ఛార్మి, నవనీత్కౌర్, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జయప్రకాష్రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు