కథలోకి వెళితే.. విదేశాల్లో చదువుతున్న రామ్ (కళ్యాణ్‌రామ్).. తాత కోరిక మేరకు తనింటికి వస్తాడు. రామ్ తండ్రి భవానీ శంకర్ (ముఖేష్ రుషి) ఊరికి పెద్ద దందాలు చేస్తుంటాడు. అదే ఊరిలో నర్సింహ (జయప్రకాష్) మరోవైపు దందాలు చేస్తుంటాడు. వీరిద్దరిని తన కార్యకలాపాల కోసం యాదు (ఆశిష్ విద్యార్థి) వినియోగించుకుంటాడు.
హాంకాంగ్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్‌లు కట్టి యాదు కోట్లు సంపాదిస్తుంటాడు. అటువంటి యాదుతో హాంకాంగ్ వచ్చిన రామ్ చేతులు కలిపి బెట్టింగుకు సహకరించి యాదు ఆస్తి మరింత రెట్టింపు చేసినట్లు నటించి అతన్ని జైలు పాలు చేస్తాడు. అక్కడే అంజలి (హన్సిక)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. ఇటువైపు ప్రేమ, అటువైపు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ చివరికి వాటిని రామ్ ఎలా నెగ్గించుకున్నాడు? యాదును అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ: కళ్యాణ్‌రామ్ పాత్ర రొటీన్‌గా ఉంటుంది. మనిషి డల్‌గా కన్పించాడు. ఎమోషన్స్ పలికించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. హన్సిక పాత్ర ఫర్వాలేదు. చిలిపితనం, అమాయకత్వం కలిపిన సన్నివేశాల్లో బాగానే చేసింది. జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి పాత్రలు వారికి కొట్టిన పిండే. అలీ కారు డ్రైవర్‌గా, జయప్రకాష్‌రెడ్డి కొడుకుగా నటించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. లక్ష్మీనరసింహశాస్త్రి (బ్రహ్మానందం) పాత్ర ప్రవేశంతోనే చిత్ర గమనం కాస్త పుంజుకుంటుంది.
అంజలికి, రామ్‌కు పెళ్లి నిశ్చయం చేసే సన్నివేశం నుంచి చివరివరకు అతను పడే మానసిన హింస.. ప్రేక్షకులకు వినోదం పండించినా అది సినిమా ఏమాత్రం సహాయపడలేదు. మిగిలిన పాత్రలన్నీ మాములుగానే ఉన్నాయి.