పాయింట్: ఇది తమిళ చిత్రం పొల్లాధవన్ చిత్రానికి రీమేక్ అని ముందే చెప్పారు. బైక్ కోసం కుర్రాడు ఏం చేశాడు? అన్నది పాయింట్
ఈ కుర్రాడి జీవితంలో మూడే ఆశయాలుంటాయి. కొత్త బైక్ కొనుక్కోవడం, దానిపై తన ప్రేయసితో షికార్లు చేయడం, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి.
తెరపైకి వెళితే... పదవక్లాసు కూడా పాస్‌కాని కుర్రాడి కథ. ఉద్యోగం లేకపోయినా మంచి బైక్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. కొడుకు పోరుపడలేక తండ్రి తన కూతురు పెళ్లికి దాచిన డబ్బును ఏదో మంచి పనిచేస్తాడనే నమ్మకంతో ఇస్తాడు.
బైక్ రాగానే బ్యాంక్‌లో లోన్ రికవరీ ఏజెంట్‌గా ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తుంటాడు. ఇప్పటికి 2 కోరికలు నెరవేరినట్లే... సడెన్‌గా ఆ సమయంలో వరుణ్ బైక్ మాయమవుతుంది. దాంతో ఒక పక్క తండ్రి పోరుకు ప్రియురాలి తండ్రి పోరు కూడా తోడవడంతో బైక్ వేటకోసం మొదలుపెడతాడు. ఆ క్రమంలో కొందరు స్మగ్లర్లతో ఢీకొంటాడు. ఆ తర్వాత ఏమయింది? బైక్ వచ్చిందా? తండ్రిని సుఖపెట్టాడా? ప్రియురాలు ఏమయింది? అనేది మిగిలిన సినిమా
వరుణ్ సాఫ్ట్ పాత్రలకైతే ఓకే. కానీ ఒకేసారి మాస్ పాత్రల్లో చూపించి దర్శకుడు సందీప్ భారీ పని నెత్తినేసినట్లయింది. అతని తెలుగు డైలాగుల్లో ఇంకా ఆంగ్లం మిక్సయినట్లు వినబడతాయి. ఇదొక ఫ్యాషన్‌గా బాగున్నా.. హీరోయినిజానికి ఇది పెద్దగా పనిచేయదు.