గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టి మరదల్ని వరించే "బిందాస్" (Bindass Cinema Review | Manchu Manoj Kumar | Sheena | Sunil | Brahmanandam)
సమీక్ష
Bookmark and Share Feedback Print
 
WD
నటీనటులు: మంచు మనోజ్‌కుమార్, షీనా, జయప్రకాష్ రెడ్డి, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, కిషోర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, ఎం.ఎస్.నారాయణ. కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కెమెరా: రమేష్‌బాబు,
సంగీతం: బోబో శశి,
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వీరూ పోట్ల,
నిర్మాత : సుంకర రామబ్రహ్మం.

పాయింట్: పచ్చిగడ్డేస్తే భగ్గుమనే రెండు కుటుంబాల్లో నవ్వులు పూయిస్తూ.. తన ప్రేమను గెలుచుకునే అజయ్‌గాడి ప్రేమకథ ఇది.

"బిందాస్" అంటే.. చాలా జోష్‌గా, హుషారుగా ఉన్నాడని అంటారు. ఈ చిత్రం అలా ఉంటుందని దర్శకనిర్మాతలు ఊహించి ఆ పేరు పెట్టేశారు. అసలు ట్యాగ్‌లైనే చిత్రానికి టైటిల్. షూటింగ్‌‌ జరుగుతుండగా, ఏదో ఒక సందర్భంలో "బిందాస్" అనేమాట యూనిట్‌ నుంచి రావడంతో దాన్ని టైటిల్‌గా పెట్టారు. సినిమా చూస్తుంటే.. విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాంరా..ను మళ్లీ కొత్తవారితో చూసినట్లుంది. ఫ్యాక్షనిజానికి కామెడీ జోడింపే ఈ చిత్రం.

ఇక కథలోకి వెళితే..
అజయ్ (మనోజ్)ది రాయలసీమ ప్రాంతం. అజయ్‌ది చిత్తూరులోని పెద్ద ఫ్యాక్షన్ కుటుంబం. మహేంద్రనాయుడు (ఆహుతిప్రసాద్) తమ్ముడు భానుచందర్ కొడుకు అజయ్. మహేంద్రనాయుడికి అదే ఊరిలో ఒకే రాజకీయపార్టీకి చెందిన శేషాద్రినాయుడు (జయప్రకాష్‌రెడ్డి)తో వైరం ఉంటుంది. అధిష్టానం నిర్ణయం ప్రకారం పార్టీ ప్రతినిధి విజయ్‌కుమార్ ఎం.పి. టిక్కెట్ మహేంద్రనాయుడుకి ఇస్తాడు.

క్రూర మనస్తత్వంగల శేషాద్రినాయుడు తనకు ఎంపీ సీటు దక్కకపోవడాన్ని అవమానంగా భావించి, వైర్యం పెంచుకోవడమేగాక వారి కుటుంబాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఓ రోజు శేషాద్రినాయుడు బంధువు చనిపోతాడు. ఆ నేరం మహేంద్రనాయుడిపై పడుతుంది.

మరోవైపు అజయ్ సిటీ కాలేజీలో చదువుతుంటాడు. అక్కడే షీనా చదువుతుంది. షీలా అజయ్ వరుసకే మరదలే. ఊరికి వచ్చిన అజయ్ ఫ్యాక్షన్ గొడవలు తెలుసుకుని వారిని మార్చాలనుకుంటాడు. ఈలోగా తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు? క్రూయల్ మనిషి అయిన శేషాద్రినాయుడి మైండ్‌సెట్‌ను ఎలా మార్చాడు. మరదలిని ఎలా పెండ్లిచేసుకున్నాడు అన్నదే కథ.

విశ్లేషణ: మంచుమనోజ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. అంతకుముందు నేను మీకు తెలుసా?, ప్రయాణం చిత్రాల్లో కొత్తపోకడలు చూపించినా, ఇందులో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. హావభావాల్లో కొన్ని షేడ్స్ మోహన్‌బాబును ఇమిటేట్‌చేసినట్లు కన్పిస్తాడు.

అజయ్ ఊరికి వచ్చినప్పటినుంచి సీరియస్‌గా ఉన్న కుటుంబంలో నవ్వులు పంచడానికి చేసిన ప్రయత్నాలకు బ్రహ్మానందం, ఎం.ఎఎస్. రఘుబాబు, సునీల్, మాస్టర్ భరత్ బాగా ఉపయోగపడ్డారు. మనోజ్ టైమింగ్ ఈ చిత్రంలో చాలా బాగుంది. పాటలు, ఫైట్స్‌పరంగా బాగానే చేశాడు.

షీనా పాత్ర పరంగా బాగానే ఉన్నా.. ఆమె మంచు పక్కన మైనర్‌లా కన్పించింది. జయప్రకాష్‌రెడ్డి పాత్ర ఫ్యాక్షనిస్టుగా కొట్టిన పిండే. చేసిన పాత్రే అయినప్పటికీ, కొత్తదనం లేకపోయినా, తన డైలాగ్ డెలివరీతోనూ హావభావాలతోను ఆకట్టుకుంటాడు.

ఫోటోగ్రఫీ చక్కగా ఉంది. సంగీతం బోబో శశి నాలుగు పాటలు ఆకట్టుకున్నాయి. సంభాషణలపరంగా వీరూపోట్ల పలుచోట్ల ఆకట్టుకునేవిగా ఉన్నాయి. మొత్తంగా పరిశీలిస్తే.. మొదటిభాగం కోపతాపాలు, ఆవేశాలు ఉన్నా.. రెండవ భాగంలో కన్పించే ఎంటర్‌టైన్‌మెంట్ మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. టోటల్‌గా "బిందాస్" ఎంతవరకు సక్సెస్ అవుతాడో? వేచి చూడాల్సిందే..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బిందాస్, సినిమా, రివ్యూ, మంచు మనోజ్ కుమార్, షీనా, సునీల్