గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "ఎక్స్‌పోజింగ్‌"తో రప్పించాలనుకుంటే... "సాధ్య"మేనా..?!! (Sadhyam Cine review | Jagapati Babu | Priyamani | Keerti Chavlaw | Tanikella Bharani)
సమీక్ష
Bookmark and Share Feedback Print
 
WD
నటీనటులు: జగపతి బాబు, ప్రియమణి, కీర్తీ చావ్లా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, వేణు, ప్రగతి, జాకీ తదితరులు
సాంకేతిక సిబ్బంది: కెమేరా: మారో పలిని, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సంగీతం: చిన్ని చరణ్, నిర్మాణం: కేబీసి ప్రొడక్షన్స్, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ

ప్రతివారు సినిమా హిట్ కావాలనే దానికోసం "సాధ్య"మైనంత ప్రయత్నం చేస్తారు. కానీ జగపతిబాబు, ప్రియమణి జంటగా వచ్చిన సినిమాలో ఇంట్రెస్ట్ పాయింట్ ఉన్నా... దాన్ని తెరకెక్కించే క్రమంలో వారిద్దరు ఆటపాటలతోనే సినిమా హిట్టు చేయాలనుకోవడం "అసాధ్య"మనిపిస్తుంది.

విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌ను ప్రమోషన్లో చూపించి క్యాష్ చేసుకోవాలనే చీప్ టెక్నిక్‌కు ప్రేక్షకులు పడిపోతారనుకునే రోజులు కావని నిర్మాత తెలుసుకోవాలి. జాతీయస్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంటేమటుకు ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించినట్లుంది ఈ సినిమాలో ప్రియమణి పాత్ర. చేసే పనిని పవిత్రంగా భావిస్తే ఇటువంటి చిత్రాలు రావేమో...

కథలోకి వెళితే....
జీవితంలో ప్రతి దానికి భయపడే మనస్తత్వం గల అమ్మాయి సుహాని (ప్రియమణి). చివరికి ఇంటి వాచ్‌మెన్ నుంచి ఆఫీస్ బాస్‌వరకూ ఎవర్ని చూసినా అదే ఫీలింగ్‌లో ఉంటుంది. ఆ ఫీలింగ్‌తోనే ఆఫీసు నుంచి లేటుగా వస్తుంది. అనుకోకుండా దారిలో కృష్ణప్రసాద్(తనికెళ్ల భరణి) రోడ్డు ప్రమాదంలో చావుబతుల్లో ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి రక్షిస్తుంది. దానికి ప్రతిఫలంగా అతని దగ్గరున్న తుపాకిని సుహానికి ఇచ్చి నీ జీవితంలో నిన్ను విసిగించిన ఎవరినైనా చంపేయమంటాడు.

ఇదేదో కొత్తగా ఉందని ఆలోచించి... తుపాకితో ఎవరిని కాల్చాలా అని ఆలోచిస్తుంది. చిన్నతనంలో తనను అన్నిరకాలుగా మోసం చేస్తూ ఆటపట్టించిన స్నేహితురాలు అనిత( కీర్తి చావ్లా) మెదులుతుంది. ఆమెను ఒక్క దెబ్బతో చంపాలనుకుని ఆమె వద్దకు వెళుతుంది. కానీ అప్పటికే ఆమెకు మనస్థితి సరిగా లేకపోవడాన్ని గమనించి దేవుడే సరియైన శిక్ష విధించాడని తృప్తి పడుతుంది.

ఇంకా ఎవరిని చంపాలా...? అని ఆలోచిస్తుండగా తను పిచ్చిగా ప్రేమించిన సందీప్(జగపతి బాబు) గుర్తుకు వస్తాడు. తన ప్రేమను తిరస్కరిస్తూ తప్పించుకుంటున్న అతడిని ఎలాగైనా చంపాలనుకుంటుంది. కానీ అతడు కూడా అప్పటికే ఎన్‌కౌంటర్లో చనిపోయాడని తెలుసుకుంటుంది. ఇక లాభం లేదని తుపాకి తిరిగి ఇచ్చేయాలని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళుతుంది.

కానీ అనుకోకుండా కృష్ణప్రసాద్‌ను చంపేస్తుంది. అసలు ఆమె అతడిని ఎందుకు చంపింది...? ఆమెకు ఈయనతో ఉన్న సంబంధమేమిటి...? సందీప్‌కు, కృష్ణప్రసాద్‌కు రిలేషన్ ఏమిటి...? అనేవి ఆసక్తికరంగా ముగింపు ఇచ్చారు దర్శకుడు.

ఒకరకంగా చెప్పాలంటే... సస్పెన్స్ చిత్రాలు చూసేవారికి చక్కని పాయింట్ ఇది. దర్శకుని ప్రతిభ ఇటువంటి చిత్రాల్లో బయటపడుతుంది. కానీ స్క్రీన్-ప్లేలో... తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోవడంతో... గాడి తప్పింది. ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్ అంటేనే పెళ్లైన కొత్తలో, ప్రవరాఖ్యుడు గుర్తుకు వస్తాయి. ఈ నేపధ్యంలో వాటి తర్వాత వస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి చేత బాగా ఎక్స్‌పోజింగ్‌ చేయించి ప్రేక్షకుల్ని రప్పించుకోవాలని చూశాడు దర్శకుడు.

కానీ ఇలాంటివి సినిమాకు ఉపయోగపడవనే చెప్పాలి. జగపతి బాబు రెండు చోట్ల కామెడీ సన్నివేశాలు పండించాడు. కీర్తిచావ్లా పాత్ర పరిమితమే. ప్రియమణి జగపతిబాబు కోసమే ఎక్స్‌పోజింగ్ చేసినట్లుగా ఉంది. ఇక కోట, గుండు సుదర్శన్, ప్రగతి పాత్రలు సన్నివేశపరంగా బాగానే ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సాధ్యం సినిమా సమీక్ష, జగపతి బాబు, ప్రియమణి, కీర్తి చావ్లా, తనికెళ్ల భరణి