గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » భూకబ్జా బకాసురలకు కనువిప్పు 'వీడింతే' బై బర్త్‌ (Veedinte by Birth Cinema Review | Vikram | Deeksha Seth)
WD

నటీనటులు: విక్రమ్‌, దీక్షాసేథ్‌, సన తదితరులు, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: రాజీవన్‌, నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి, దర్శకత్వం: సుసీంద్రన్‌.

పాయింట్‌: భూకబ్జాలు చేసి రాజకీయనాయకురాలిగా ఎదిగిన 'అక్క'పై విక్రమ్‌పోరు. తమిళంలో రూపొందిన 'రాజపట్టాయ్‌'కు అనువాదం.
విడుదల: 30.12,.2011 శుక్రవారం

తెలుగువాడైనా తమిళంలో అగ్రహీరో స్థాయికి ఎదిగిన విక్రమ్‌ చిత్రాలంటే జనాల్లో ఓ క్రేజ్‌ ఉంది. ఏదో కొత్తదనం చూపించడానికి తను ట్రై చేస్తుంటాడు. అపరిచితుడు, శివపుత్రుడు, నాన్న వంటి వైవిధ్యాల్ని పోషించిన విక్రమ్‌ ఈసారి ఏకంగా 17 పాత్రల్ని పోషించాడు. అందులో సగం ఓ పాటలో వస్తే.. మిగిలినవి... విలన్‌ను ఇంటరాగేట్‌ చేసే సందర్భంలో వాడతాడు. అసలు ఇవన్నీ ఎందుకు పోషించాడంటే... కథ తెలుసుకోవాల్సిందే...

విక్రమ్‌ సినిమాల్లో ఫైటర్‌. తను పెద్ద విలన్‌గా అవ్వాలన్నదే గోల్‌. అనాథాశ్రయాన్ని నిర్వహించే దక్షిణామూర్తి(కె.విశ్వనాథ్‌)ని కన్నకొడుకు అవినాష్‌ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని విక్రమ్‌ తన రూమ్‌కు తీసుకువస్తాడు. రూ. 300కోట్ల విలువైన ఆ స్థలాన్ని తన రాజకీయ ఎదుగుదలకు పణంగా రాజకీయపార్టీ నాయకురాలైన 'అక్క' అని పిలవడే రంగనాయక(సన)కు దక్షిణామూర్తి కొడుకు అవినాష్‌ ఇచ్చేస్తాడు. దాంతో అనాథలైన వారికి న్యాయం జరిగేలా విక్రమ్‌ చేసిన ప్రయత్నమే ఈ చిత్రకథ.

కథ ఇప్పుడు జరుగుతున్న విషయాల నేపథ్యంగానే సాగుతుంది. సొసైటీలో గౌరవంగా పిలువబడే ఎందరో వ్యక్తుల జీవితాలకు సన పాత్ర కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే... అక్క అంటూ.. రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన ఆ పాత్ర కొందరు రాజకీయనాయకురాళ్లను గుర్తు చేస్తుంటాయి. సీరియస్‌గా ఉండే ఆ పాత్రకు సన సరిపోయింది.

విలన్‌ అవ్వాలనే తపనతో విక్రమ్‌ చేసే ఫీట్లు... గతంలో కమల్‌హాసన్‌ చేసిన చిత్రాల్నిపోలినా... సినిమారంగంలో ఫైటర్ల జీవితాలు మరోసారి ఆవిష్కరించారు. విక్రమ్‌ చేసిన రకరకాల పాత్రలు కూడా గతంలో కమల్‌ చేసిన దశావతారాన్ని తలపిస్తాయి. విలన్‌ ప్రదీప్‌ రావత్‌ను అరెస్ట్‌ చేసి ఇంటరాగేట్‌ చేసే సన్నివేశాల్లో విక్రమ్‌ వేసిన గెటప్స్‌ అచ్చు దశావతరాన్ని గుర్తుచేస్తాయి.

ఇందులో విక్రమ్‌ చేసిన యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ. తన బాడీకి తగినట్లుగా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. కానీ సినిమా అంతా ఎక్కువ యాక్షన్‌ ఉండి.. కథలో బలం తగ్గింది. విక్రమ్‌ స్టయిలిష్‌గా తీర్చిదిద్దాడు.

యువన్‌ శంకర్‌రాజా తన సంగీతం మార్క్‌ను చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. రాజీవన్‌ ఆర్ట్‌, మది సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. టోటల్‌గా ఈ సినిమాలో యాక్షన్‌ ఎక్కువ. అవి సినిమాటిక్‌గా చూపించాడు. కానీ కథలో స్ట్రాంగ్‌నెస్‌ లోపించింది. రాష్ట్రంలో భూకబ్జాలు చేసి ఒక్కో మెట్టుకు ఎక్కిన వారందరికీ ఈ చిత్రం కనువిప్పులా ఉండే ప్రయత్నం దర్శకుడు చేశాడు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia