వరా ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన విశాఖ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, ప్రీతి జింగానియా, సింధు తులానీలు ప్రధాన పాత్రలను పోషించారు. మాక్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని క్రేజీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి వహించగా.. స్క్రీన్‌ప్లేను మరో వైవిధ్య దర్శకులు చంద్రశేఖర యేలేటి అందించారు.
విజయ్ కురాకుల సంగీతాన్ని అందించగా ఇప్పటి వరకు హాస్యహీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇందులో నెగెటివ్ పాత్రను పోషించడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.