ప్రేమికుల సవాల్...
|
నేటి ట్రెండ్‌లకు తగ్గట్లుగా ఈ చిత్రం కూడా ప్రేమవ్యవహారంతో కూడకున్న కథాంశంలో నడుస్తుంది. అందమైన ఇద్దరు ప్రేమికులు.. ప్రేమ తెచ్చిన చిక్కులను ఎలా ఎదుర్కొన్నారు.. వాటిని ఎలా అధికమించారన్న దానిపైనే కథ నడుస్తుంది. 'టెన్త్ క్లాస్' చిత్రంలో ఓ సాధారణ యువకుడిగా కనపడ్డ భరత్.. ఈ చిత్రంలో మంచి ఫిజిక్‌తో (బహుశా జిమ్ మహత్యం కావచ్చు) అందగాడిలా కనపడతాడు.
ఇక మనసంతా నువ్వే.. చిత్రంలో తూనీగ.. తూనీగా.. పాటలో ముద్దులొలికించే మోముతో ఆకట్టుకున్న సుహాని ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంకా ముమైత్‌ఖాన్ ఎంటీవీ పాప్ ఆల్బమ్ పాట తరహాలో ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.
