యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై'.
త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మోహన్‌బాబు సైతం ఓ ప్రత్యేకపాత్రలో నటిస్తుండడం విశేషం. రజనీకాంత్‌ను విపరీతంగా అభిమానించే ఓ కుర్రాడి పాత్రలో ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల చెన్నైలో రజనీకాంత్ చేతులమీదుగా విడుదలైంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలనాడు నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడుతా' చిత్రానికి సంగీతాన్ని అందించిన సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం విశేషం.
ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మీ కోసం వీక్షించండి మరి.
|