యూత్‌స్టార్ నితిన్ "విక్టరీ" ట్రైయిలర్
|
ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ సమస్యను తీసుకుని దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు రవి సి. కుమార్ వందశాతం సక్సెస్ అయ్యారని అచ్చిరెడ్డి తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నితిన్ హీరోగా చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేశారని తెలిపారు. చక్రి సంగీత సారధ్యంలో రూపొందించిన "విక్టరి" ఆడియో ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో యూత్‌స్టార్ నితిన్, మమతా మోహన్‌దాస్, సింధూతులానీ, శశాంక్, అశుతోష్, రాణా, ఎం.ఎస్ నారాయణ, తనికెళ్ళభరణి, రఘు బాబు, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీ కోసం...
