మాధవన్, ఒంటరి'ఫేమ్ భావన హీరోహీరోయిన్లుగా తమిళంలో విజయం సాధించిన 'ఆర్య' చిత్రాన్ని "ఆర్య ఎంబిబిఎస్" పేరుతో తెలుగులో అనువదించారు. తెలుగులో ఇది వరకూ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలశేఖరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రేఖా కంబైన్స్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.వి.రావు, పత్సా నాగరాజులు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ప్రేమ, యాక్షన్ అంశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని, తమిళంలో ఈ చిత్రం మంచి విజయం సాధించిందని నిర్మాతలు అన్నారు.
ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా మలచబడిందని, 'ఒక్కడు' చిత్రం తరహాలో ఆయన పాత్ర ఉంటుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. మాటలు : వెన్నెలకంటి. కవిత, వడివేలు, పొన్నాంబలం తదితరులు నటిస్తున్న ఈ చిత్ర సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీకోసం...
|