ప్రేమ కథాంశంతో "కృషి" ట్రెయిలర్ మీకోసం

WD
యశ్వంత్, సుహాని జంటగా శ్రీ వెంకట సత్యసాయి ఫిలింస్ పతాకంపై రూపొందుతోన్న "కృషి" చిత్రం ఈ నెల 18వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత పేకేటి సుబ్రమల్లేశ్వరరావు వెల్లడించారు. శివాజీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఎంతటి విజయం వెనుకైనా నేనున్నానని సగర్వంగా చెప్పుకునేది కృషేనని, మరి ఇద్దరు మనసులు కలిసి మురిసే ప్రేమాయణంలోనూ కృషి ఉంటోందని అన్నారు.

Selvi| Last Modified బుధవారం, 16 జులై 2008 (18:51 IST)
నిర్మాత మాట్లాడుతూ... ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల మెప్పును పొందాయని, చిత్రం కూడా మరింత ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. చిత్రం గురించి చెప్పాలంటే, కృషి అనే పదం వింటేనే ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుందని, త్రికరణశుద్ధిగా కృషి చేయాలనే పాయింట్‌తో తెరకెక్కించామని అన్నారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం..


దీనిపై మరింత చదవండి :