"మా ఆయన చంటి పిల్లాడు". ట్రెయిలర్
Publish: Tue, 22 Jul 2008 (14:14 IST)
Updated: Tue, 22 Jul 2008 (14:13 IST)
లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "మా ఆయన చంటి పిల్లాడు". శివాజీ, మీరా జాస్మిన్ భార్య భర్తలుగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం డిటియస్ కార్యక్రమాలు జరుపుకుంటోందని రాజా వన్నెంరెడ్డి చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సారథి విజయ ప్రకాశ్ తెలిపారు. శ్రీలేఖ అందించిన పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందాయని అన్నారు. శివాజీ, మీరాజాస్మిన్ భార్యభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంగీత మరో కథానాయికగా నటిస్తోంది. పరస్త్రీ వ్యామోహంలో పడిన భర్తను ఓ ఇల్లాలు ఎలా దారికి తెచ్చుకుంటుందన్న పాయింట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుంచనున్నట్లు నిర్మాత అన్నారు.