1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

8 ప్యాక్ నితిన్ "విక్టరీ" ట్రెయిలర్ మీకోసం..

8 ప్యాక్ నితిన్
WD
నితిన్, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో, ఆర్. ఆర్ మూవీమేకర్స్ పతాకంపై రవి సి.కుమార్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ మూవీ విక్టరీ. "విక్టరీ" అనే పాజిటివ్ టైటిల్‌తో తమ బేనర్‌పై వస్తున్న మరో చిత్రమిదని, మంచి ఎంటర్‌టైన్‌మెంటుతోపాటు అందర్ని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు సి. కుమార్ అన్నారు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓ సమస్యను ఆధారంగా తీసుకుని తెరకెక్కించడంలో దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యారని అచ్చిరెడ్డి తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నితిన్ హీరోగా చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేశారని తెలిపారు. చక్రి సంగీత సారధ్యంలో రూపొందించిన "విక్టరి" ఆడియో ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంకా ఈ చిత్రంలో సింధూతులానీ, శశాంక్, అశుతోష్, రాణా, ఎం.ఎస్ నారాయణ, తనికెళ్ళభరణి, రఘు బాబు, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో వీక్షించండి..
About Writer
Selvi