1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రామ్, జెనీలియా "రెడీ" ట్రెయిలర్ మీకోసం..

రామ్
WD
రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం రెడీ. ఢీ చిత్రం తర్వాత జెనీలియా, శ్రీనువైట్ల దర్శకత్వంతో రూపొందిన చిత్రం ఇది. అలాగే దేవదాసు, జగడం చిత్రాల తర్వాత రామ్ నటిస్తున్న మూడో చిత్రం ఈ రెడీ.

దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని అన్ని పాటలు హిట్టయ్యాయి. ఈ చిత్రంలో రామ్, జెనీలియా జంట చాలా చూడముచ్చటగా ఉంటుందని, తన గత చిత్రాల తరహాలోనే "రెడీ" చిత్రం 19 జూన్వ తేదీన విడుదలై ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని దర్శకుడు అన్నారు.

యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దేనికైనా రెడీ అనే ఓ చురుకైన యువకుని పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం..
About Writer
Selvi