1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"కథానాయకుడు" ట్రెయిలర్ మీ కోసం..

వినోదం వెండితెర ట్రెయిలర్స్ కథానాయకుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుచేలన్ అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యం
WD
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "కథానాయకుడు" చిత్రం ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1200 ప్రింట్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగులో "కథానాయకుడు", తమిళంలో "కుచేలన్"గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఒకవైపు ప్రేక్షకులు, మరోవైపు రజనీ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

తెలుగులో అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యం, పి.వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జగపతి బాబు తొలిసారిగా రజనీకాంత్‌తో కలిసి నటించడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి. ప్రకాష్ సమకూర్చిన సంగీతానికి ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించిన "కథానాయకుడు" సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీ కోసం...
About Writer
Selvi