కళ్యాణ్ రామ్ "హరేరామ్" ట్రైలర్ మీకోసం...
|
కథ, కథనం విభిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, యాక్షన్ కథా నేపథ్యంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "హరేరామ్" యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.
"అతనొక్కడే" చిత్రానికి ఏమాత్రం తీసిపోని సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని దర్శకుడు హర్షవర్ధన్ చెబుతున్నారు. ఇకపోతే... మయూరి ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీకోసం...
