"వాడే కావాలి" ట్రైలర్ వీక్షించండి
|
యువతరం ఆలోచనలకు దర్పణంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాతలు అన్నారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో సినిమా ఆద్యంతం కన్నుల పండువగా ఉంటుందని, ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన తమ చిత్రం తప్పకుండా హిట్టవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
అమ్మాయిలు ఎన్ని రకాలు.. అంటూ సాగే పాట చాలా చక్కగా ఉంటుందని రాజేంద్ర దర్శన్ అన్నారు. అలాగే 'నువ్వులేని నేను నేను కాను' అనే పాట టాప్ టెన్‌లో నిలుస్తుందని ఆకాంక్షించారు. చంద్రహాస్ మరో కథానాయకునిగా నటిస్తున్న ఈ సినిమాలో అలీ, సీనియర్ నరేష్, చిత్రం శ్రీను, పరమేష్, రమేష్, ధనరాజ్, రేవతి, హేమ, అన్నపూర్ణమ్మ, కోట శంకరరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
