జగపతిబాబు "హోమం" ట్రైలర్ మీకోసం
|
హాలీవుడ్ హిట్ 'డిపార్టెడ్' ఆధారంగా రెడీ అవుతున్న ఈ సినిమా మాఫియా వారికి పోలీసులకి మధ్య జరిగే గేమ్‌గా ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్లో థ్రిల్‌కు గురిచేస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు చిత్రం ఆడియోను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే ఆవిష్కరించారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆడియోకు ఇప్పటికే శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.
|
ఇకపోతే హీరోయిన్ సాక్షి శివానంద్ ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌లో కనబడుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తచేసుకున్న ఈ సినిమా నెలాఖరులో విడుదల కానుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
