1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"యువత" ట్రైలర్ మీ కోసం...

వినోదం వెండితెర ట్రైలర్స్ హ్యాపీడేస్ నిఖిల్ అక్ష జంట పరశురామ్ యువత  హరి ఉమాప్రకాష్ ఆడియో రేటింగ్ టాప్
హ్యాపీడేస్ నిఖిల్, అక్ష జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "యువత". హరి, ఉమాప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

దర్శకుడు మాట్లాడుతూ.... యువతను లక్ష్యంగా చేసుకున్న చిత్రమైనప్పటికీ, విభిన్న కథాంశంతో తెరకెక్కనుందని చెప్పారు. ఈ చిత్రాన్ని వినోద భరితంగా తీర్చిదిద్దుతున్నామని, యువత ఆలోచనలు, అభిప్రాయాలు ప్రస్తుతం ఎలా ఉంటున్నాయనే అంశంపై ఈ సినిమాలో చర్చించామని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... టైటిల్‌ను బట్టి "యూత్" సినిమా అనుకుంటే పొరబాటేనని, వాళ్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించినప్పటికీ అన్నివర్గాలను ఆకట్టుకుంటుందన్నారు. ఇకపోతే ఆడియో రేటింగ్ టాప్-5లో ఉందని, సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

ఇంకా ఈ సినిమాకు... కెమెరా.... జస్వంత్, సంగీతం... మణిశర్మ, పాటలు... కృష్ణచైతన్య, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం.... పరుశురామ్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
PNR