"సిద్ధు ఫ్రమ్ సికాకుళం" ట్రైలర్‌ను చూడండి
అల్లరి నరేష్ హీరోగా, శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "సిద్ధు ఫ్రమ్ సికాకుళం". ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా, మల్లా విజయ ప్రసాద్ నిర్మాత బాధ్యతలు చేపట్టారు.
ఈ సినిమాలోని ఐదు పాటలకు కె.ఎం.రాధాకృష్ణ చక్కని బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా కె.ఎం.రాధాకృష్ణ మాట్లాడుతూ... పాటలను కనువిందుగా తెరకెక్కించేందుకు దర్శకుడు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. శివేంద్ర కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
చిత్ర నిర్మాత మల్లా విజయ ప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా తీయాలనే ఆసక్తితో రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. పూర్తిస్థాయిలో వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. వెల్ఫేర్ క్రియేషన్స్ బేనర్‌లో నిర్మించే చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కని సెంటిమెంట్ చిత్రంగా తెరకెక్కనుందని చెప్పారు.
సికాకుళం నుంచి సిద్ధు పట్టణానికి ఎందుకు వచ్చాడు, అక్కడ అతనికి ఎదురైన అనుభవాలనే చిత్రంగా మలిచామని దర్శకుడు తెలిపారు. వేణుమాధవ్, చంద్రమోహన్, ధర్మవరపు, జయప్రకాష్‌రెడ్డి, విజయరంగరాజు, అమిత్ తదితరులు ఈ సినిమాలో మిగిలిన పాత్రలు పోషించారు.
ఇకపోతే... అల్లరి నరేష్ ఇంతకుముందు 25 సినిమాల్లో నటించినప్పటికీ, "సిద్ధు ఫ్రమ్ సికాకుళం"లో కాలేజీ స్టూడెంట్‌గా విభిన్న పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ ద్వారా తిలకించి ఆనందించండి.