Oka amayi O abhayi Cinema Trailer | "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" సినిమా ట్రైలర్
ఔటాఫ్ కాలింగ్ ఏరియాలో ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య జరిగే ఆసక్తికరమైన ప్రేమకథతో "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రం రూపొందుతోంది. గతంలో ఖాకీ చొక్కా, అశోకచక్రంవంటి చిత్రాలను నిర్మించిన వై.అలెక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఫేమ్ రామ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ద్వారా విశ్వాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రూపాకౌర్, లహరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తన 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో మాస్, యాక్షన్ చిత్రాలు తీశానని, తొలిసారిగా క్లాస్‌ను ఆకట్టుకునే ప్రేమకథను తెరకెక్కించామని నిర్మాత వెల్లడించారు.
ఈ చిత్రం సస్పెన్స్‌తో కూడిన ప్రేమ కథ అని చిత్ర దర్శకుడు చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటలను మనోజ్ఞ, సుధాజీవన్, వరికుప్పల యాదగిరి, గీతామాధురి ఆలపించారు.