1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. "పిస్తా"ను ట్రైలర్లో చూడండి

Pista Cinema Trailer | "పిస్తా"ను ట్రైలర్లో చూడండి

వినోదం
విశాల్, శ్రియ జంటగా నటిస్తోన్న చిత్రం "పిస్తా". విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకుడు. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోంది.

ఈ సినిమా గురించి అలీ మాట్లాడుతూ.. హీరో స్నేహితునిగా నటిస్తున్నానని, విలేజ్‌నుంచి సిటీకి వచ్చిన యువకుడి కథ ఇదని తెలిపాడు. విశాల్ మాట్లాడుతూ.. "సెల్యూట్" తర్వాత తెలుగులో నేరుగా చేస్తున్న చిత్రమిదని, భూపతి పాండ్యన్ దగ్గర పనిచేసిన అయ్యప్ప ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు.

తొలిసారిగా ప్రకాష్‌రాజ్‌తో నటిస్తున్నానని, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా ఉంటుందని విశాల్ అన్నారు. వినడానికి కథ పాతదైనా, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఆకట్టుకుంటుదన్నారు. ఇంకా ఈ సినిమాలో కమెడియన్స్ చాలా మంది ఉన్నారని విశాల్ వెల్లడించారు.

శ్రియ మాట్లాడుతూ.. చక్కని ప్రేమకథతో కూడిన ఈ సినిమాలో యాక్షన్ ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో భరణి, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, అన్నపూర్ణ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. మాటలు.. శశాంక్, కెమేరా.. ప్రియన్, దర్శకత్వం.. సభా అయ్యప్ప.
About Writer
SELVI.M