గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "పిస్తా"ను ట్రైలర్లో తిలకించండి (Vishal| Pista| Trailer| Sreya| Prakash Raj)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
విశాల్, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పిస్తా. విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విశాల్ 6 ప్యాక్ రాముడిగా, అలీ ఆంజనేయుడిగా నటించే దశ్యాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని నిర్మాత అన్నారు. విలేజ్‌నుంచి సిటీకి వచ్చిన యువకుడి కథ ఇదని ఆయన తెలిపారు.

విశాల్ మాట్లాడుతూ... సెల్యూట్ తర్వాత తెలుగులో నేరుగా చేస్తున్న చిత్రమిదని, భూపతి పాండ్యన్ దగ్గర పనిచేసిన అయ్యప్ప ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. తొలిసారిగా ప్రకాష్‌రాజ్‌తో కలిసి నటిస్తున్నానని, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వినడానికి పాత కథలా అనిపించినా స్క్రీన్‌ప్లేలోని కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రంలో కమెడియన్స్ చాలా మంది నటిస్తున్నారని విశాల్ వెల్లడించారు. శ్రియ మాట్లాడుతూ చక్కని ప్రేమకథతో కూడిన ఈ సినిమాలో యాక్షన్ ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని తెలిపారు.

ఈ చిత్రంలో భరణి, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, అన్నపూర్ణ, తెలంగాణ శకుంతల తదితరులు ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు- శశాంక్, కెమేరా- ప్రియన్, దర్శకత్వం- సభా అయ్యప్ప.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విశాల్, పిస్తా, ట్రైలర్, శ్రియ, ప్రకాష్ రాజు