1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Josh| Cinema| Trailer| NagaChaitanya| Karthika| Dilraju| Vasu Varma | "జోష్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

జోష్
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా, నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక కథానాయికగా నటిస్తోన్న చిత్రం "జోష్". శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు కొద్దిగా ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తయిందని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. తమ పతాకంపై అన్ని హిట్ సినిమాలే వచ్చాయని, ఇదికూడా హిట్ అయితే 3వ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని దిల్‌రాజు వెల్లడించారు. మిగిలిన రెండు పాటల్లో ఒకటి స్విట్జర్లాండ్‌లోనూ, రెండోది హైదరాబాదులోనూ చిత్రిస్తామని దిల్‌రాజు తెలిపారు.

ఆగస్టులో విడుదలయ్యేందుకు సిద్ధమౌతోన్న "జోష్" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో వీక్షించండి.
About Writer
SELVI.M