1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Magadheera| Cinema| Trailer| Ram Charan Teja| Kajal Agarwal | "మగధీర"ను ట్రైలర్లో తిలకించండి

మగధీర
మెగాస్టార్, "చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, సెక్సీతార కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "మగధీర". ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బోగవల్లి ప్రసాద్ వెల్లడించారు.

29న విడుదలయ్యేందుకు సిద్ధమౌతోన్న ఈ సినిమాలో, చిరంజీవి సినీకెరీర్‌లో సూపర్ హిట్ అయిన "ఘరానామొగుడు"లోని "బంగారు కోడి పెట్ట.." పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. అంతేగాక చిరంజీవి సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు.

ఇకపోతే.. ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా నమోదు చేసుకోని ప్రముఖ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పునర్జన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే "మగధీర"లో రియల్ స్టార్ శ్రీహరి సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్‌పై "గజనీ" తర్వాత ఎక్కువ బడ్జెట్‌లో నిర్మితమైన చిత్రం ఇదేనని సినీ వర్గాల్లో టాక్. మొత్తం 1000 ప్రింట్లతో ప్రపంచంలోని 40 దేశాలలో మగధీరను విడుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలిపారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M