1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Movie

A Intlo| Movie| Trailer| Chinna| Mayuri| Horror Cinema| Thriller | హారర్ మూవీ "ఆ ఇంట్లో" ట్రైలర్ మీ కోసం..

ఆ ఇంట్లో
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'శివ'తో నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన "చిన్నా" ఆయన అడుగుజాడల్లోనే దర్శకునిగా మారి 'ఆ ఇంట్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. జితేందర్‌రెడ్డి అనే తన ఒరిజినల్‌ పేరును నిర్మాతల్లో ఒకరిగా వేసుకున్నాడు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటునిగా పక్కవారిని ఎక్కువగా పరిశీలించే చిన్నా తనలో ఉన్న టాలెంట్‌తో దర్శకుడిగా మారి "ఆ ఇంట్లో" చిత్రానికి దర్శకత్వం వహించి సక్సెస్‌ అయ్యాడు. హార్రర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళే వాళ్ళకూ "ఆ ఇంట్లో" చిత్రం తప్పకుండా నచ్చుతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇందులో మయూరి (ఆషాశైనీ) అద్భుతంగా నటించింది. హాలీవుడ్‌ చిత్రాలను తలపించేలా చిన్నా దర్శకుడిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ సన్నివేశం బోర్‌కొట్టకుండా చూపాడు. కథ, కథనం ఆసక్తికరంగా మార్చడంలోనూ, పరిమిత నటీనటులతో ఒకే ఇంటిలో చిత్రాన్ని చూపించి మెప్పించడం విశేషమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

నటుడిగా తనేంటో నిరూపించుకున్న చిన్నా.. మయూరిని నటిగా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమపడ్డాడు. ఆమె నటన ఈ సినిమాలో బయటపడింది. మొత్తానికి థ్రిల్‌ కల్గించే చిత్రం చూశామన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడిలో కలిగించే ఆ ఇంట్లో సినిమా ట్రైలర్‌ను తిలకించండి.
About Writer
SELVI.M