Guts| Cinema| Trailer| Satya Prakash| Dinesh| Paki Hegde | "గట్స్" సినిమా ట్రైలర్‌ను చూడండి
రాష్ట్రాన్ని గడగడలాడించే ఓ గూండా ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గట్స్’. సత్యప్రకాష్, దినేష్, పాకీహెగ్డే ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇకపోతే.. గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై సాయిరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ.. సత్యప్రకాష్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ కథకు ఆయనే యాప్ట్ అని గోసంగి అన్నారు.
'ఇందులో కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేమకథల్లో ఇప్పటి వరకు ఎవరూ స్పృశించని కోణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ధనుంజయ్ మిశ్రా సమకూర్చిన సంగీతం, పైడాల శ్రీనివాస్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన వివరించారు.
నిర్మాత మాట్లాడుతూ 'విభిన్న తరహాలో సాగే ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో విజయభాస్కర్, చిత్రం భాషా, జెన్నీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు జయంత్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.