గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "అ.. ఆ.. ఇ.. ఈ.." సినిమా ట్రైలర్‌‌ను తిలకించండి (A Aa E Ee Cinema Trailer| Srikanth| Meera Jasmine| Sada| Mahatma)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
"మహాత్మా" చిత్రంతో వంద సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్, గ్లామర్ స్టార్స్ మీరా జాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "అ.. ఆ.. ఇ.. ఈ..". ఈ సినిమా ఈ నెల ఆరోతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో కామిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సెంటిమెంట్, మిస్టరీ వంటి పలు అంశాలను కూడా మేళవించారు. ఇందులో శ్రీకాంత్ మీరాజాస్మిన్, సదాల ముద్దుల భర్తగా అద్భుతంగా నటించాడు. మీరాజాస్మిన్, సదాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

బ్రహ్మానందం, అలి, సునీల్, ఎం.ఎస్. నారాయణ, కోవై సరళ, రఘుబాబులు ఈ సినిమాలో హాస్యాన్ని పండించారు. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పండించే ఈ చిత్రానికి ఎమ్ఎమ్ సురేఖ అందించిన సంగీతం చక్కగా అమరింది.

అయితే కథ చాలా నెమ్మదిగా ప్రారంభం కావడం.. ఇంటర్వెల్‌కు తర్వాత కూడా కథాగమనాన్ని నత్తనడకన నడిపించడం "అ.. ఆ.. ఇ.. ఈ.." సినిమాలోని మైనస్ అని సినీ పండితులు అంటున్నారు. మర్డర్ మిస్టరీ, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన "అ.. ఆ.. ఇ.. ఈ.." చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షిద్దామా..?.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అ ఆ ఇ ఈ, సినిమా, ట్రైలర్, శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా, మహాత్మా