తమిళనాడు రాష్ట్రంలో దాదాపు మధ్య ప్రాంతంలో గల సుందరమైన పర్వతప్రాంతం కొడైకెనాల్. దక్షిణ భారతదేశంలోని వేసవి విడిదిగా ఈ ప్రాంతం సుపరిచితమే. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్‌రోడ్‌లో ప్రయాణించాల్సిందే. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రెండు వేసవి విడుదులలో ఊటి తర్వాత కొడైకెనాల్‌దే స్థానం.
పర్వతప్రాంతమైన ఈ ప్రాంతం ఎల్లప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఏడాది పొడవునా ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఉన్నా వేసవిలో మాత్రం రద్దీ బాగా ఉంటుంది.
కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం, కురింజి స్వామి దేవాలయం మొదలుగునవి పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై సరస్సు అనేది ఓ అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు.
ఇది కొడైకెనాల్ పట్టణానికి దాదాపుగా నడిబొడ్డున ఉంది. ఇందులో బోటు షికారు చేయడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అలాగే గ్రీస్ వ్యాలీ అనేది విశాలమైన లోయ ప్రాంతము. ఈ లోయను చూడడానికి వీలుగా టూరిజం శాఖ కొండ చివరన ఓ ఫ్లాట్‌పాం నిర్మించింది. ఇక్కృడి నుంచి చూస్తే ప్రకృతి అందాలు అత్యంత రమణీయంగా కన్పిస్తాయి.
|