భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ఓ అద్భుతమైన ప్రాంతంగా ఎల్లోరా గుహల్ని గురించి చెప్పవచ్చు. కొండలను తొలచి వాటికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చిన ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఎల్లోరా గుహలు సజీవ సాక్షాలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు అతికొద్ది దూరంలో ఉన్న ఈ ఎల్లోరా గుహలను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు.
ఎల్లోరా గుహల విశేషాలు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు పర్యాటకుల మనసులో చెరగని ముద్ర వేస్తాయనడంలో సందేహం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 34 గుహలు హిందూ, జైన, బౌద్ద మత సంస్కృతులకు చిహ్నాలుగా నిర్మింపబడ్డాయి.
ఇందులో 12 గుహలు బౌద్ధ సంస్కృతికి సంబంధించినవి కాగా హిందూ సంస్కృతికి సంబంధించి 17 జైన మతానికి సంబంధించి 5 గుహలు ఉన్నాయి. ఆయా గుహల్లో ఆయా మతాలకు సంబంధించిన వివిధ సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పులు ఈ గుహలను నిర్మించడం గమనార్హం. చాళుక్యులు, రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో ఈ గుహలను చెక్కినట్టుగా చరిత్ర పేర్కొంటోంది.
అద్భుత దృశ్యం కైలాస దేవాలయం ఎల్లోరా గుహల్లో అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవాల్సింది కైలాస దేవాలయం గురించే. ప్రారంభం నుంచి 16వ గహలో ఉన్న ఈ ఏకశిలా నిర్మాణం ఓ అద్భుతమైన శివ సన్నిధి. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే కన్పించే ద్వజస్థభం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ద్వజస్థంభ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.
|